పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/273

ఈ పుట ఆమోదించబడ్డది

232

సౌగంధిక ప్రసవాపహరణము

మా మదిలో ననుమానంబు దీర
ధరణిపై భీముండు ధననాథు నెదిరి
దుర మొనరించిన, ద్రుంగుట నిజము;
కొలదీర్చవలె నని గోరుచుండఁగను 745
లలిమీర కాకతాళీన్యాయమయ్యె;
నర్జునుం డొకఁ డున్న నాహవస్థలిని
నిర్జింపఁగా వచ్చు నిజసేనఁ గూడి
తడయక మన మేఁగి ధర్మజుఁ గవలఁ
బడసేసి పాంచాలిఁ బట్టి తేవలయు 750
నని పల్క విని క్రోధుఁడై నరనాథుఁ
గనుఁగొని గద్దించి కర్ణుఁ డిట్లనియె.
మేలయ్య కురురాజ! మెచ్చితి నిన్ను !
స్థూల సూక్ష్మంబుల సుళు వెఱుంగుదువు
బలమరి బ్రాహ్మణపల్లియఁ జేరి 755
తలచెడి యిండిండ్లు తప్పక తిరిగి
తిరిపమెత్తుక తిని ధీరత్వ ముడిగి,
పరదేశులై గుళ్లపంచల మొఱఁగి[1]

  1. పరదేశులై గుళ్లపంచల ముడిగి (క. చ)