ఈ పుట ఆమోదించబడ్డది
210
సౌగంధిక ప్రసవాపహరణము
క్రుమ్మి రెమ్మియు జిమ్మి గ్రుచ్చి నాటించి
బిమ్మటి గొనతేనె పెరవూగినటుల[1]
గదిసిన యక్షరాక్షససేనఁ జూచి385
బెదరక నెదురేఁగి భీమసేనుండు
దురుసుగా నెడలేక తొలుకారువాన
గురియుచందంబున ఘోరబాణములు
సడలక నేయుట సంధించుటయును;
గడు నెఱుంగకయుండఁగా వప్పళించి[2] 390
పక్కలు బిక్కలు పాదము ల్దొడలు
చెక్కలు ముక్కలు చేతులు చెవులు
నడుములు మెడలును నరములు శిరము
లుడుగని గనుక నొక్కుమ్మడి చిదిమి
భటుల నెల్లను బటాపంచ గావించి 395
చటుల భయంకరజ్యారవం బెసఁగఁ
గమకించి తురగసంఘములు నూటాడి