ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
207
గహ్వరగగనము ల్గగ్గోలుపడగ![1] 335
సింహనాదము చేసి జృంభించి దనుజ
యక్షవీరులఁ గాంచి యరుణాయమాన
వీక్షణుండై ఘోరవివిధ బాణములు
నిగుడించి బెగడించి నెగులు బుట్టించి
పగయెల్ల సణఁగించి పడగలు ద్రుంచి 340
యురుములు బెకలించి యుదరము ల్సించి
శిరములు ఖండించి చెక్కులు చెక్కి
శరములు నురుమాడి కండలు చెండి
చరణము ల్నరికి పిచ్చలుచేసి జనప
తురగ సంఘముల రౌతుల నుగ్గుచేసి 345
కరివరాహంబుల గణములు గూర్చి
రథితుల జంపి సారధుల మర్దించి
రథరథ్యచయము చూర్ణంబు గావించి
గదఁ బూని విజయశంఖంబుఁ బూరించి
- ↑ 1.గంహరుల్ గగనంబు గగ్గోలుపడగ (క)2. గగనగహ్వరములు గగ్గోలుపడగ
పగటెల్ల మడిగించి పడి గెలు ద్రుంచి, (చ)