పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

వత్సరము లుండును. ఈయనవద్దనుండి తరమునకు ముప్పదియేండ్ల చొ ప్పున లెక్కించినచో ప్రకృతకవి యిప్పటికి రమారమి 150 సంవత్సరముల కాలము వాఁ డగును . అధ్యాత్మ రామాయణము, శుకచరిత్రము లో నగుగ్రంథముల విరచించిన మహాకవియు లింగమూర్తికవికుమారుఁడు శిష్యుఁడు నగు రామమూర్తి తనతండ్రి లిఖించిన రతీమన్మథవిలాసము నగు శుద్ధప్రతి వ్రాయుచు క్రింద, “ప్లవంగ సంవత్సర జ్యేష్ఠ బ 13 గురు వారమువఱకు పరశురామపంతులురామన్నగారు రతిమన్మథవిలాసము పూర్వ ప్రతిలోనున్న క్రమాన వ్రాసిరి.” అని వ్రాసికొనెను. జీర్ణమయ మై యున్న గ్రంథమువలనను, ప్రకృతవంశీయులకు రామమూర్తికవి యైదవపురుషుఁగుటవలనను ప్లవంగసంవత్సర మిప్పటికిఁ బదియేండ్ల క్రిందను డెబ్బది యేండ్ల క్రిందను గతించినది కాక నూటముప్పది సంవత్స రముల క్రింద గతించినదై యుండును. అంతకుముందు లింగమూర్తిగారు రమారమి యిరువది సంవత్సరముల క్రిందనుండె ననుకొనినను సీతారా మాంజ నేయ మిప్పటికి నూటయేఁబది సంవత్సరముల క్రింద - అనఁగా క్రీ. శ. 1760 ప్రాంతములో విరచింపఁబడియుండుననుట నిస్సందేహము. కవిజీవిత మిఁక విడిచి కావ్యము విమర్శింతము.

సీతారామాంజనేయసంవాదము

ఇది యితనితక్కిన గ్రంథములకంటే శ్రావ్యముగఁ బ్రౌఢముగ నిర్దు

స్టముగా నున్నది. కావ్య ముంతయు యోగశాస్త్రమగుటచేఁ గవితావిమ ర్శమునకు వీలు కానరాదు. అందం దుఁ గలస్వతంత్ర పద్యముల చేఁ గవి శక్తి సామర్థ్యములు గుర్తింపవచ్చును. ప్రాచీనకవుల పద్యములపోలికల నను సరించి వ్రాయబడిన పద్యములు కొన్ని సీతారామాంజనేయమునకలవు.

సీ, "స్వామియై నిగమాలి భూమియై సురపురో
          గామియై యబ్ధిజాకామి యుండ
    హారియై హలహలాహారి యై భవదంశు
          ధారియై ప్రసవాయుధారి యుండ
                      వసుచరిత్రము, చతుర్థాశ్వాసము, ప, 36.