పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

49


కట్టుట, అన్నదానము, తోఁటలు వేయించుట అనునవి అపూర్తకర్మములు)(ఉపాసన = మంత్రజపపూర్వకముగా దేవతలను ధ్యానించుటయు, యాగ = యజ్ఞములును, యోగ = అష్టాంగములతోఁ గూడిన రాజయోగము మొదలగు యోగములును, జప = గాయత్రి మొదలగుమంత్రముల జపించుటయును, తపః = శరీరమును శోషింపఁజేయునట్టి కృఛ్రము చాంద్రాయణము మొదలగు వ్రతంబును, సత్య = యథార్థముఁ జెప్పుటయును, శౌచ = లోపల వెలుపల పరిశుద్ధముగా నుండుటయును, దయ = భూతములయందు ప్రేమతో నుండి వానికష్టముల నోర్వలేకపోవుటయును, శీల = సత్స్వభావంబును, వ్రత = బ్రహ్మచర్యాది వ్రతంబులును, దాన = ఈవియు, ఆది= మొదలైనవి యనియెడు, నానావిధ = అనేక విధములైన, అనోకహ = వృక్షములతోఁగూడిన, ఉద్యాన = ఉపవనములచేత, విరాజితంబును = ప్రకాశించుచున్నదియును, శాస్త్ర ...బును - శాస్త్ర = తర్కము మొదలగుశాస్త్రము లనియెడు, పుష్ప = పూవులతోడ, ఉపేత= కూడిన, నిగమ= వేదములయొక్కయు, ఆగమ= కామికము మొదలగు నాగమములయొక్కయు, అంత = కొన లనియెడు, (వేదముయొక్క కొనలు ఉపనిషత్తులు, ఆగమముల యొక్క కొనలు చర్య, క్రియ, యోగ జ్ఞానసాదములయందు జెప్పఁబడు కర్మసాదాఖ్య కర్తృసాదాఖ్య మొదలగునని అని తెలిసికొనవలయును.} కల్పలత = కల్పవృక్షములచేత విలసితంబును, షడ్వి ...బును - షడ్విధ = ఆఱువిధములైన, సమాధి = సమాధులనియెడు. (మనసు నొకవస్తువునం దేకాగ్రముఁజేసి యావస్తువును రూపసహితముగాఁ గాని రహితము గాఁ గాని ధ్యానించుట సమాధి యనఁబడును.) సౌధ = రాజగృహముల చేత, విభ్రాజితంబును = మిగుల ప్రకాశించుచున్నదియును, పరమ . . .బును - పరమ =నిరతిశయమైన, (దీనికంటే నధిక మగునది లేదనుట.) అధ్యాత్మవిద్య = బ్రహ్మజ్ఞానమువలనఁగలిగిన, ఆనంద = బ్రహ్మానంద మనియెడు, జల = నీటిచేత, అభిషిక్త = తడుపఁబడిన, నిర్మల= పరిశుద్ధమైన, చిత్తవృత్తి = మనోవృత్తి యనియెడు (మనస్సుఅనుట.) అంగణ = ముంగిటియందున్న , శమ = మనోనిగ్రహము, దమ = ఇంద్రియముల జయించుట, ఉపరతి = చిత్తవిశ్రాంతి (లేక సన్యాసము,) తితిక్షా =శీతోష్ణాదుల సహించుట, శ్రద్ధా = శ్రద్ధ, సమాధాన = గురువుపదేశించిన విషయములను శాస్త్రములఁ జూచియు తనబుద్ధిచే విచారించియు నిశ్చయించుకొనుట, అమానిత్వ= నిరభిమానము, అదంభిత్వ = డంబము లేకపోవుట, ఆది = మొదలైన, కల్యాణగుణ = సద్గుణములనియెడు, మణిగణ =రత్నములతో నమర్చియున్న , రంగవల్లీ = ముగ్గులచేత ప్రకాశితంబును, నిరతి...బును-నిరతిశయ = మహత్తరమైన, కైవల్య= మోక్షమనెడు, భాండాగార = బొక్కసముచేత, శోభితంబును, ప్రకాశించునదియుసు, ఫలకామ ... లలితంబును — ఫలకామనాభావ = ఫలములనుగోరని, స్వభావనియత = అయాగుణస్వభావములనుబట్టి శాస్త్ర