పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/39

ఈ పుట ఆమోదించబడ్డది

20

శ్రీ సీతారామాంజనేయసంవాదము


అవసానంబున = అంతమునందు (మరణ సమయమునందు ప్రారబ్ధకర్మ మనుభవించిననే యీశరీరము తొలఁగిపోవును. ఇదియే మరణము.) ఘటాకాశంబు = కుండలోని యాకాశము, మహాకాశంబునన్ = సర్వవ్యాపక మగునాకాశమందు, కలసినవిధంబునన్ = అప్రయత్నముగనే ఐక్యమును జెందినట్లు, (ప్రతిస్థలమునందును ఆకాశము గలదు గదా! కుండలోపల నున్న యాకాశము, లేక, కుండలోపల జలములోఁ బ్రతిబింబించిన యాకాశము ఆకుండ పగిలిపోవఁగానే మహాకాశములో నప్రయత్నముగఁ గలసిపోవుట ప్రత్యక్షము.) నాయందున్ = పరబ్రహ్మస్వరూపుఁడ నగునాలోన, విదేహకైవల్యంబున్ = దేహోపాధి లేకపోవుటచేతఁ బరిపూర్ణ మగునైక్యమును (మోక్షమును) ఒందెదు=పొందఁగలవు. సందేహంబు లేదు, అని, ఆజ్ఞాపించి, ఇప్పుడు, ఈవు = నీవు, బ్రహ్మాండపురాణంబునందున్, అధ్యాత్మ రామాయణంబు, ఉమామహేశ్వర సంవాదరూపంబై = పార్వతీపరమేశ్వరుల ప్రశ్నోత్తరరూపంబుగ, ఒప్పున్ = కలదు, అందున్ = ఆ అధ్యాత్మ రామాయణంబునందు, శ్రీరామహృదయంబు, అను, ఇతిహాసంబు = కథ, సీతారామాంజనేయసంవాదంబున్ = సీతారామహనుమంతులసంవాదముతో, ప్రవర్తిల్లున్ = ఉన్నది. (సీతారామాంజనేయులసంవాదమే ఆ శ్రీరామహృదయమునందలివృత్తాంతము అనుట.) అది = ఆకథ, సంక్షేపరూపంబు = మిగులసంగ్రహంబుగా నున్నది, కావునన్, అయ్యర్థంబు = ఆకథయందలివిషయంబును, విస్తరించి, ఒక్క ప్రబంధంబుగాన్ = ఒక కావ్యముగా, రచియించి = చేసి, నాపేరన్ = నా పేరుతో, అంకితంబుసేయుము = నాకు కృతి యిమ్ము, సర్వపాపవినిర్ముక్తుండవు ఐ = పాపరహితుఁడవై , కృతార్థుండవు అయ్యెదవు, అని, ఆనతిచ్చి = ఆజ్ఞాపించి, తిరోహితుండు= అంతర్థానముఁ జెందినవాఁడు, అయ్యెన్ , అంతటన్ = తర్వాత, మేల్కని = ధ్యానమునుజాలించి, పరమ .... నై - పరమ= అధికమగు, ఆనంద = సంతోషముతో, భరిత= నిండిన, అంతఃకరణుండను ఐ = మనస్సుకలవాడ నై, (ఉత్తరపద్యముతో నన్వయము.)

తా. ఇట్లా మహాదేవగురురూపుఁ డగు శ్రీరామమూర్తి శిష్యునియందలి ప్రేమాతిశయముచేఁ బ్రత్యక్షమై, ధర్మార్థకామమోక్షముల నొసంగఁజాలునక్షరములు గల నారాయణనామము నుచ్చరించుచు నే నొనర్చు సాష్టాంగనమస్కారముల నంగీకరించి పకపక నవ్వుచు, 'నాకంటె నీవు గాని నీకంటె నేను గాని వేఱుకాము. నీవు స్థూలసూక్ష్మకారణశరీరములకంటె వేరై జాగ్రదాదు లగునవస్థల జూచుచుఁ బంచకోశముల నతిక్రమించి సచ్చిదానందస్వరూపుఁడవై యున్నావు. నేనును అట్లె యున్నాను. కావున మన కిరువురకును భేద మించు కైనను లేదు. ఈఅభేదదృష్టిని మనసునందు స్థిరముగ నిలిపికొని జీవన్ముక్తి ననుభవింపుము. ప్రారబ్ధానుభవము ముగిసినపిదప ఘటాకాశము మహాకాశమునం దైక్యముఁ జెందునట్లు నాయం దైక్యము