పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

vii

సీ. “ఏకమై పరమై విశోకమై సత్య మ
         లోకమై వ్యాపకాలోక మగుచు
     సారమై చిదచిదాకారమై యతినిర్వే
         కారమై విగతసంసార మగుచు.........”
                                            సీతారామాంజనేయము, ఆ-2, ప-6.

ఉ. “హా యను గాధినందనమఖారినిశాటమదాపహారిబా
     హా యను గ్రావజీవదపదాంబురుహా యను రాజలోక సిం
     హా యనుఁ బోషితార్యనిసహా యనుఁ గానల కేఁగితే నిరీ
     హా యను నిర్వహింపఁగలనా? నిను బాసి రఘూద్వహా యనున్.”
                                            రామాభ్యుదయము. ఆ.5, ప-10.

ఉ. మాయను మిథ్యగాఁ దెలియుమా యను దత్కృత మెల్లఁ గల్లసు
     మ్మా యను మేను నే ననకుమా యను సాక్షిని నీవు చూచుకొ
     మ్మా యనుఁ జూడఁగానితరమా యను నే నని నిశ్చయించుకొ
     మ్మా యనుఁగాకపో నితరమా యనుమానము మానుమా యనున్.”
                                           సీతారామాంజనేయము, ఆ-3. ప.143 .

ఇట్టిపోలికలచే నీకవి ప్రాచీనకవులకవిత్వముపై గౌరవభావము కలవాఁ డనియు రసార్దియనీయుఁ బాఠకులు తలంతురుగాక. కఠినతమ మగు వేదాంతశాస్త్రమును, కవితాప్రపంచమున వెలయించుట సామా న్యకార్యము కాదు. అందును నీకవివర్ణనాంశములలో నిరోష్ఠ్యపద్య ములు, సర్వతః ప్రాసపద్యములు, చతుః ప్రాసపద్యములు వ్రాసి తనశక్తిని వెల్లడించియున్నాఁడు. విస్తరభీతిచే నుదాహరింప మానితిమి. ఈ లింగ మూర్తికవిమొదలు కడకు వంశవృక్షములోనివారందఱును కవులుగను పండితులుగను రామమంత్రోపాసకులుగ నున్నారు. ఈ పవిత్రమగు వంశమునఁ బట్టాభిరామయ్యగారును వారిపుత్రులును గవితాపరిచయము లేనివారుగ నున్నారు. ఈ సీతారామాంజనేయమునకు సర్వంకషముగ మొదట వ్యాఖ్యానమొనరించిన శ్రీ పాలపర్తి నాగేశ్వరశాస్త్రినిగూర్చిన