పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/421

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

సింహాసన ద్వాత్రింశిక


ద్వేగంబునఁ జీఁకటి ది
గ్భాగంబుల నిండె మేఘపటలము భంగిన్.

187


క.

గుడగుడ నుడికెడి యుదకము
ముడివడ గర్జితములట్లు మ్రోయగ దెసల
న్వెడఁ గడర మెఱపుఁదీవల
వడుపున నమ్మడువు వెడలి వచ్చిరి పడఁతుల్.

188


ఆ.

అట్లు వచ్చి పంచమాదిస్వరంబుల
శ్రుతుల లయలఁ దాళగతుల యతుల
గానగేయగీతగాంధర్వభేదంబు
లలవరించి పాడి యాడునపుడు.

189


క.

నరలోకము నహిలోకము
సురలోకముఁ జూచినాఁడఁ జూచినసతు లె
వ్వరుఁ గారు వీర లని భూ
వరుఁ డచ్చెరువంది యుత్సవముతో నుండెన్.

190


క.

ఆలోన నాటపాటలు
సాలించ యొకింత మగిడి జనపతిఁ గని నీ
వాలోకమునకు రమ్మని
లోలాక్షులు పిలిచి మడుఁగులోనికిఁ జనినన్.

191


క.

కడుఁదెంపరియై భూవరుఁ
డుడికెడు వెడమడుగునడుమ నుఱికెను మును గ్రాఁ
గెడునూనియకొప్పెరలోఁ
బడి వెడలినవాఁడు [1]నీళ్ళఁ బడు టచ్చెరువే.

192
  1. దీనఁ బడు టచ్చెరువే