పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/357

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

సింహాసన ద్వాత్రింశిక


గౌరవంబు మెఱసి వారల కవసరం
బిచ్చి కరుణఁ జూడ నిచ్చగింపు.

14


క.

ఇంతియకాదు నరేశ్వర
యింతుల తొలువేఁట[1] ఋతువు లేలెడుఘనుఁ డా
కంతుని ప్రాణసఖుండు వ
సంతుం డున్నాడు కొలువఁ జనఁగావలయున్.

15


క.

"కాలో వసంత" యను వా
క్యాలంకృతి నన్నిఋతువులం దధికుడు త
త్కాలోచితపూజలచేఁ
గాలాత్మకుఁ డైనవిభుఁడు కడుఁ బ్రియ మందున్.

16


ఆ.

పూజ్యులైనవారిఁ బూజింపకున్నచో
మేలు దొలఁగునండ్రు మేదినీశ
యష్టసిద్ధు లాది నగపడ్డ వనక నేఁ
డవ్వసంతపూజ కరుగవలయు.

17


క.

అనవుడు నౌఁగా కనినం
జని యుపవనమధ్యమున వసంతోత్సవఖే
లనమునకుఁ దగినవస్తువు
లొనగూర్చి యమాత్యచంద్రుఁ డొయ్యన మగిడెన్.

18


వ.

ఇట్లు మగిడి.

19


ఉ.

పంచశరాధిదేవతలపట్టులుగా మణివేదిపంక్తి ని
ర్మించితి రత్నమండపము మించులబట్టల మేలుకట్లు గ

  1. తొలునెట, తలవెంట