పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/321

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

సింహాసన ద్వాత్రింశిక


డనద ననాథ నిరాధారఁ గావరే
        యనుచు వీతెంచె నార్తారవంబు[1]


ఆ.

దాని కుల్కి మిగుల దయ గలియును లావు
లేమి యేమియు ననలేక యుండి
రేపకడన లేచి యాపురజనుల న
య్యబలవార్త దెలియ నడిగి వింటి.

294


వ.

ఎ ట్లనిన.

295


క.

చెల్వొనరెడు పురి చేరువ
బిల్వవనాంతమున రేయి భీమాకృతితో
నిల్వలనిభుఁ డొకదనుజుఁడు
చెల్వం బెనుకశల మొత్తి చెండుచు నుండున్.

296


క.

ఆపొలఁతుక రేయెల్లను
వాపోవుచునుండ నసుర వారింపంగా
నోపరు పరు లెవ్వరుఁ బృ
థ్వీపాలక యేను విన్న తెఱఁ గిది చుమ్మీ[2].

297


ఉ.

నావుడుఁ జోద్యమంది నరనాథుఁ డనాథఁ గృశాంగి నంగనం
గావఁ గడంగి హస్తమున ఖడ్గము తోడుగ సెట్టిఁ గూడి యా
త్రోవన యేఁగి దూరగతి దోఁపఁగ నల్లన నొక్కనాఁడు ల
క్ష్మీవిభవాఢ్య మౌ మధురఁ జేరె నినుం డపరాద్రిఁ జేరఁగఁన్.

298


క.

మలయుచు నెయ్యెడఁ గలయం
దెలివిపడ న్వెలిఁగి భువనదీపము చనినన్

  1. మహార్తరవము- చి. సూ.
  2. బృథ్వీపాలక దీనికతము దేవర యెఱుఁగున్