పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/319

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

సింహాసన ద్వాత్రింశిక


ధనము గలుగువాఁడె తగవుల కాఢ్యుండు
ధనము గలుగువాఁడె మనుజవిభుఁడు.

283


ఆ.

ధనము గలిగేనేని ధర్మార్థకామమో
క్షముల నచట నచట జరుపవచ్చు
ధనముగలుగువేళ జను లెల్లఁ దమవారు
ధనము లేనివానిమనికి చావు.

284


మ.

అని చెప్ప న్విని యప్పురందరుఁడు గర్వాక్రాంతుఁడై నవ్వి యి
ట్లనియెన్ దానము భోగముం దగవుఁ జేయం బాడి గాదేని యా
ధన మేలా మఱి లాభ మేల సుఖికిన్ దారిద్ర్యమే మేలు నాఁ
జనదే మర్త్యుఁడు మంటిపాలయిన నేసౌఖ్యంబు భోగించెడున్.

285


క.

మును దనకుం గానున్నది
పనివడి యగు నారికేళఫలరసముక్రియం
జననున్నది చనుఁ గరి గ్ర
క్కున మ్రింగిన వెలఁగపండు గుంజును బోలెన్.

286


క.

తొడఁ గట్టఁ బూయఁ బెట్టం
గుడువం జెప్పుదురు గాక గొనకొని గడియం
జెడియెడిబ్రదుకున కిడుమం
బొడివోసికొనంగఁ జెప్పు బుధులుం గలరే[1].

287


చ.

అనుచు ననాదరంబున నిజాప్తుల దూఱి యుదారబుద్ధిఁ జం
దనమృదుపుష్పవస్త్రవనితాపరిభోగవిషక్తచిత్తుఁడై
యనుదినమున్ ధనంబుఁ గలయ న్వెదచల్లుచు నొయ్యనొయ్య ని
ర్ధనదశ నొంది వంది యనుతాపము నందుచుఁ గంది కుందుచున్.

288
  1. బుద్ధులు గలవే