పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/313

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

253

సింహాసన ద్వాత్రింశిక


ఆ.

పురము ధనము రాజ్యభోగంబు విడిచియు
మమ్ముఁ గలసి యిచట మాయనుజ్ఞ
నబలఁ గూడి పిదప నందఱఁ బాసి నేఁ
డొంటి నేఁగ నీకు నుచిత మగునె.

247


వ.

అనవుడు ననుగమనోద్యోగ గావున మలయవతీకన్య ధైర్యం బవలంబించి.

248


క.

ప్రాణము కొఱకై యితరుల
ప్రాణము దినుచుండు వానిప్రాణము గావం
బ్రాణం బెడఁబాసిన నా
ప్రాణేశుం డిపుడు మనలఁ బాయుట యరుదే.

249


క.

మనకుండుట యి ట్లెఱిఁగియు
మన కుండుట తగునె యితనిమార్గంబున నా
మనమరిగెడు గతిఁదడయక
మన మరిగెడు తెఱఁగుఁ గనుఁడు మఱి వగ పేలా.

250


ఆ.

అనిన శంఖచూడుఁ డందఱచావుల
కేన మూల మైతి నితనివెంట
నరుగువాఁడ ననిన నాదికారణ మేన
మున్ను సత్తు ననియెఁ బన్నగారి.

251


క.

నావుడు మీ కిందఱకుం[1]
జావం బనిలేదు సుతునిజాడనె యేఁగం
గావలయుం జితి వేగమె
కావింపుము శంఖచూడ కడుఁబుణ్య మగున్.

252


ఆ.

అనుడు నభముఁ జూచి యమరవర్గములార
ఘనపరోపకారమునకు మెచ్చి

  1. కిద్దఱకుం