పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/312

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

251


నస్థిర మైనప్రాణమున నగ్గువ[1] మిక్కిలిగా జగంబునన్
సుస్థిర మైనకీర్తిఁ గొనజూచిన లాభమునం గొఱంతయే.

241


వ.

కావున వగ పుడిగి నాగకుమారు నాకుమాఱుగాఁ దలంచుకొనుం డని సాయాసకృతాంజలియై యంత్యప్రణామం బొనరించిన సవినయానతుండై వినతాసుతుం డోకుమారచంద్రా నాయజ్ఞాననిద్ర దొలంగె నీధైర్యసాహసపరోపకారగుణంబులం బరిణమించితి నా కేమిహితం బానతిమ్మనిన.

242


క.

దయ సేయుము పాములపై
భయభీతులఁ గావు ధర్మపథమునఁ జను ని
శ్చయ మిది దురితము దీనను
లయ మగు నుదకమునఁ బడ్డలవణముభంగిన్.

243


క.

అని చెప్పి శంఖచూడా
వినుమా గురుజనులసేవ విడువకు మిఁక నీ
జనని కడు బెగడకుండగఁ
జనుమీ యని పలికి హృదయజలజములోనన్.

244


క.

రుద్రునిఁ దలఁచుచుఁ గీర్తిస
ముద్రుండు పరోపకారమున నలసిన యా
ముద్ర తనమేనఁ దోఁపఁగ
నిద్రించినగరణి దీర్ఘనిద్రం జెందెన్.

245


వ.

అంతం దత్సహచరీసహితు లయిన జననీజనకులు తమ యురోముఖశిరోఘాతహాహాకారమహారావంబులు మలయగహ్వరంబున నుపబృంహితంబులై దిక్కులు పిక్కటిల్ల బిట్టేడ్చుచు మూర్ఛిల్లుచు నుభయకృతోపచారంబులఁ దెలియుచు నలయుచుఁ బలవరించుచు.

246

  1. అన్నువ, అధ్యత