పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

xxix


క. ఈసామర్థ్యము నీకడ
   వీసంబునులేదు మగిడి వెసఁ జనుమనినన్
   వేసరిన భంగి భోజుం
   డా సింహాసనము డిగి గృహంబున కరిగెన్.

మూలగ్రంథములో 11 గద్యపద్యములలో ఉన్న కథను 28 గద్యపద్యములకు పెంచెను. మూలములో దైవజ్ఞుని అర్థవంతమైన ఆశీర్వాదమును వదలి విక్రమార్కుని జాతక చక్ర గ్రహస్థితి ఫలములను చెప్పెను. పంచాంగశ్రవణము సంవత్సర ఫలములకు బదులుగా సాధారణమైన గ్రహస్థానములు ఫలములు చెప్పబడినవి. ఇవి అనవసరములు. దైవజ్ఞుడు క్షామారిష్టమునకు చెప్పిన శాంతులు చేసినను వర్షము కురియనందున అశరీరవాణి దేవాలయమందలి 'ఆశాపూరణి' ఆను దేవికి 32 లక్షణములు గలవాని కంఠరక్తము నొసగిన అరిష్టము తొలగునని మూలము నందు కలదు. గోపరాజు దీనినెందుకో మార్చెను. “దైవజ్ఞుడు చెప్పిన శాంతి హోమములు ఆశాపురి దేవిగుడి ముందు చేసినను వర్షము కురియలేదు. అశరీరవాణి రాజా! ఆశాపురి దేవత సీకు దివ్యశరశక్తి ననుగ్రహించినది. కావున దానిచే శనైశ్చరుని గతిని అడ్డుకొన్న వర్షము కురియునని చెప్పును. రాజట్లే శరసంధానము చేయగా శని ప్రసన్నుడై క్షామము పోగొట్టును" గోపరాజు ఈ మార్పు నెందుకు చేసెనో తెలియదు. ఇందువలన మూలమందలి సారస్యము చెడినది. ఇట్లే గోపరాజు ప్రతి కథలోను తన ఇష్టమువచ్చినట్లు మార్పులు చేసినాడు. ఆ మార్పులు సరసములుగ ఉండవు విక్రమార్కుడు ధర్మము ఎట్టిదని అడుగుట దైవజ్ఞుడు ధర్మమనగా ఏమో తెలుపుట. పూర్తిగా అధిక ప్రసంగము. మరొక మార్పును చూడుడు.

మొదటి కథలో విక్రమార్కునకు ఇంద్రుడు సింహాసనము ఇచ్చిన ఘట్టమున్నది. మూలమున ఇంద్రునకు రంభా ఊర్వశుల నర్తనములలో తార