పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/294

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

233


వ.

అనిన నోయమ్మ నీ నెమ్మనంబున నింత యుమ్మలికం బేల నమ్ము మతనిం దెచ్చెద నూఱడు మని చతురిక మనోహారిక యను సఖిం జూచి యీచేడియ గౌరీధామంబున జీమూతకేతు కుమారు సుకుమారుం జూచి వలచినయది యది మనరాజున కెఱింగించుట విచారం బగునే.

151


క.

చెప్పినఁ బతి గోపించును
జెప్పకయుండినను బాల చిక్కెడు మనకుం
దప్పులు దొలఁగునుపాయము
చొప్పడు నేదేని బ్రదుకుఁ[1] జూడఁగ వలయున్.

152


క.

అని తలపోయుచు నుండఁగ
వనజంబులు వెలయఁ గుముదవనములు సొలయం
గనుకని చీఁకటి పొలియఁగఁ
దనరుచి దివిఁగలయఁ బొలయఁ దపనుఁడు పొడిచెన్.[2]

153


సీ.

ఆవేళఁ జతురిక యనువునఁ బ్రాణంబు
        నిలుపంగఁబూని యానెలఁత లేపి
యిష్టునిఁ గూర్చెద నేతెమ్ము గౌరిని
        వాసమ్ముకడ కని యాసగొలిపి
కొని చని మాధవీకుంజంబులోపలఁ
        జల్లని పల్లవశయ్య నునిచి
వగవకు జీమూతవాహనుం దెచ్చెద
        నని నాలుగడుగులు నడచునంత

  1. చొప్పడు నేదీని బ్రదుకు చి. సూ. తప్పదు యేపనియైనను ముప్పవు
    మున కేమియైన మోసమువచ్చున్
  2. క. మనసిజునియేపు జాఱఁగఁ ...తన రుచి దివిగలయ బాలతపనుఁడు పొడిచెన్.