పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/258

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 197

దామరచూలి లంజియలతల్లులఁ జంపఁడు లంజకాఁడు గా
కేమనవచ్చు నాతని నటేని విటావలి నిస్తరింపదే. 225

వ. అని పెక్కువిధంబుల వితర్కించుచున్న మఱియు నొక్కెడం గొందఱు సుందరులు పానగోష్ఠికిం గడంగి కాదంబంబును , మాధవంబును, నైక్షవంబు, క్షీరంబు, నాసవంబు, వార్షంబు, రతఫలంబు లనఁ బాకభేదంబుల మూలస్కంధకుసుమఫలసంభవంబుల బహువిధంబుల మధురంబులైన మధువిశేషంబు లెల్లం బరిమళద్రవ్యపరిమిళితంబుగాఁ గూర్చి పాత్రంబుల నించిన. 256

క. అతి మధురంబైన నిజా
మృతరసములకంటె నిదియ మే లని తారా
పతి చేరెనొక్కొయనఁ ద
ద్ప్రతిబింబము లలరె దివ్యపాత్రంబులలో. 257

వ. అప్పుడు. 258

సీ. కామాక్షికిని మహాకాళికిఁ జండికి
నక్కజియ్యకుఁ[1] గాళి కంబికకును
వింధ్యవాసిని కేకవీరకు మున్నుగా
నెల్లవేల్పులకు బిందించి మ్రొక్కి
త్రావుచు నెడనెడఁ దాల్పుగా వండిన
నంజుటిపొరకలు నంజుకొనుచు
గ్రుక్కెడు చవిచూడు మక్క యీమధువని
తీపులు దమలోనఁ జూపుకొనుచు
తే. నెట్టివస్తువు ల్గడియించె నీతఁ డనుచు
బ్రహ్మఁ గొనియాడి యిదెసాఁకఁ బట్టుమనుచుఁ

  1. గన్నజియ్యకు