పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/240

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 179

నప్పురోహితునకు నాత్మజుం డగు కమ
లాకరుం డన నవివేకి గలఁడు. 165

క. ఆకమలాకరుఁ డాకమ
లాకరసాదృశ్యముగ జడాశయుఁ డైనన్
శోకము మదిఁ బొదలంగ వి
వేకము పుట్టింపఁ దండ్రి వెరవున దూఱెన్[1].165

క. చుట్టములకుఁ దలిదండ్రుల
కెట్టియెడం బ్రియము నెఱపనెడపని చదువుల్
గట్టిగ నెఱుఁగనిపుత్రుఁడు
పుట్టుట కులమునకుఁ దెవులు పుట్టుట చుమ్మీ. 166

క. విను ముత్తమ మగుపుట్టువు
గనుపట్టెడు నట్టిరూపు గలమోదుగుఁబూ
వును మూర్ఖుండును బ్రబలెడు
వనమున భవనమునఁ దగినవాసన గలదే. 167

క. కులసతికి సిగ్గు క్షత్రియ
కులజునకున్ జయము వర్తకున కోపికయుం
గలిమికి వితరణమును వి
ప్రులకు న్విద్యయును దగినభూషణము లగున్. 168

క. పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తా నె
వ్వరి కిచ్చినఁ గోటిగుణో
తరవృద్ధి భజించు విద్య తనధన మెపుడున్. 169

  1. వెరచుచు దూఱెన్