పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/154

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 93

క. రావణకంసాదికర
క్షోవీరులఁ జంపి తన్నుఁ గూడఁగనిచ్చెం
గావున సమములు నల్లని
దేవరకోపములు నట్టిదేవరవరముల్. 137

సీ. మున్నీటిపాపయు మున్నీటితేపయు
నిల్లాలు నిల్లునై యెసఁగువానిఁ
బాములపగవాఁడుఁ బాములవగవాఁడుఁ
దేరును బాన్సునై తేరువానిఁ
గలువలచుట్టంబుఁ గలువలపెట్టంబుఁ
దనరెండుకన్నులై తనరువానిఁ
బూవింటివాఁడును బూవింటివాఁడును
గారాపుబట్టులై[1] గలుగువాని
ఆ. జోడులేనికంటిజోగికి జోడుగా
నున్నవానిఁ బెక్కు మన్నవాని
దల్లి దండ్రియైన నల్లనివేల్పును
గంట చెడనిముక్తిపంట గాదె. 138

క. చొత్తము చత్త మనుచు ను
ద్వృత్తు లగుచుఁ దేగి ప్రతాపవిషయముపై దం
డెత్తి చనుదెంచినం గని
యత్తఱిఁ దా వెడలె నాబృహత్సేనుండున్. 139

చ. వెడలి నిజాప్తసైన్యపరివేష్టితుఁడై చని గర్వపాటవం
బడరఁగఁ బోరిపోరి బల మంతయుఁ జచ్చినఁ జిచ్చులోపలం

  1. గారాపుసుతులుగా గట్టియై పట్టియై కలుగువాఁడు - చిన్నయసూరి