పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/142

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 81

సీ. శిరమున విమలపుష్కరవతి యగుమాల్య
వతి రత్నమాలికావతి యనంగ
మృగపాదఘట్టన మృదులమౌజేగుఱు
ధూళి శేఖరితసిందూర మనఁగఁ
బ్రబలసమీరణోత్పతితంబు లైన పు
ష్పంబులు కరశీకరంబు లనఁగ
సర్వతోముఖసముచ్చాలనవారి[1] ని
ర్ఝరములు మదజలస్రావ మనఁగఁ
తే. దన్నుఁ జేరినమేఘముల్ మన్ననంగ[2]
సాలతరువులు బర్హధ్వజము లనంగ
నేచిస్వారాజ్యపట్టగజేంద్రులీల[3]
నిలిచిపొలుచు నయ్యచలంబు నృపతి యెక్కె.[4] 77

శా. లంకేశారిపదాంకితంబులు ఝరాలంకారకూలంకషల్
పంకేజాకరసంకులాంతరములం బ్రవ్యక్తదివ్యాంగనా
సంకేతంబులు మీనకేతనధనుష్టంకారశంకావహా
ఝంకారాళికులంబులుం గల మహాశైలస్థలుల్ చూచుచున్. 78

క. ధారాధరమార్గాగత
ధారాళం బగుచు ధరణీధరమధ్యకృతా
ధారం బై ధరఁ బరఁగిన
ధారాతీర్థంబు గనియె ధారాధీశా. 79

వ. కనిన నితని మనఃప్రసాదంబు దట్టం బై నిలిచె. 78

  1. చ్చాలనలోలి
  2. పన్ననంగ
  3. ఉజ్జయిని రాజుపట్టగజేంద్రలీల-ఈ పాఠము యతిచెడినది
  4. యిక్కడ వ. "అచటఁ దెరువుఁజూపుచు మావంతు క్రియాహరుండు చూపమున్నుగా నతండు చని" అని యొకదానిలోఁగలదు.