పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. జూదరి సత్యంబుఁ జోరుని ధర్మంబు
సరసుని కోపంబు సవతిపొత్తు
బాషండు మతమును బ్రాహ్మణు కలహంబుఁ
దులువ సంగడమును ఖలుని తపముఁ[1]
గులటల భక్తియుఁ గోమటి నిజమును
బణ్యాాంగనల ప్రేమ పంద బిరుదు
బగతుర సైరణ యెగచు వైరాగ్యంబుఁ
బేద పెద్దఱికము వాది ధనము
ఆ.వె. నధమ సంశ్రయంబు నైంద్రజాలికమును
బొమ్మ సొమ్ము[2] మునుఁగ కొమ్మపట్టు
మంత్రి లేని రాజ్యమహిమయు నా వేళ
సుస్థిరములు పిదప నస్థిరములు. 193

ఆ.వె. మంత్రశక్తి నాత్మ మఱి పెట్టెగా నుగ్ర
దండవిష మడంచి దండి గలిగి
యర్థ మొదవ భూపుఁ డను పాముఁ బట్టి యా
డించు మంత్రి గారడీని కరణి. 194

కం. కనియుం గానక యిచ్చల
జనఁ జూచినఁ బోవనీక జనపతిఁ గరి చా
డ్పునఁ బట్టి యంకుశముగా
ననువగు పనిఁ చెప్పు మంత్రి యాధోరణుఁడై. 195

ఆ.వె. కావఁబోవఁ గర్త గావునఁ దనమాట
త్రోవ నలవికాదు త్రోవ యెఱిఁగి

  1. తగవు
  2. గొడ్డుసొంపు