పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9


17: ప్రతివాదులు, ఆ రిట్ పిటీషన్ కౌంటర్ లో రైతు వారీ పట్టా యొక్క యదార్ధతను విబేధించినారు, మరియు రైతు వారీ పట్టా రిజిస్టరులో, రైతువారి పట్టా గురించి 1977 - 1980 సం. వరకు ఎట్టి ఎంట్రీలు లేవని, వాదన చేసినారు.

18: మాన్యులు సింగులు జడ్జి, వారి ఆర్డరు ద్వారా 28.11.2001లో, కేసు పరిష్కరిస్తూ, కలెక్టరు, చిత్తూరు దర్యాప్తు జరిపి, ఆర్డరులు సూచించిన గడువులోగా సరియగు ఆర్డరు జారీ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు.

19: తరువాత, కలెక్టరు, చిత్తూరు దర్యాప్తు నిర్వహించి ఆర్డరు ఇచ్చారు, సంబంధిత భాగం, క్రింది విధంగా ఉన్నది: “కేసు పరిశీలించబడినది తిరుపతి రూరల్ మండలలోని, తిరుచానూరు గ్రామానికి చెందిన, సర్వే నంబరు 234లో భూమిని, దరఖాస్తు దారుడు హక్కు కోరుచున్నాడు. తిరుచానూరుకు చెందిన సర్వే నం.234 లోని మొత్తం 113.67 % ఎకరాల భూమి, పెద్ద చెరువు టేంకుగా ప్రకటించబడినది, ఇట్టి తీర్పు 03.09.1984 నాడు రాజ పత్రం నెం. 9 లో ప్రకటించబడినది. తరువాత, వ్యాజ్యములు మొదలైనవి, రిట్ అప్పీలు నెం. 941 & 1070/88 నందు, 13.04.1992 నాడు గౌరవ హైకోర్టు, I.D.T. కి హేతుబద్ధమైన నిర్ణయాన్ని తీసుకోవల్సిందని, ఉత్తర్వులు ఇచ్చారు. ఇట్టి ఉత్తర్వు దృష్ట్యా, ఐ.డి.టి. చిత్తూరు ఎల్.ఎ.ఏక్టు, 1956, సెక్షన్ 2 - A కి అనుగుణంగా, 11-5-1993 నాడు హేతుపూర్వక ఆర్డరు, ఐ.డి.టి. నెం. 1/83 నందు ప్రకటించుచూ, తిరుచానూరు నందలి సర్వేనెం. 234 లోబడి వున్న 113.67 1 ఎకరాల భూమి 'టేంకు పోరంబోకు' గా ప్రకటించినారు.

అటు తరువాత, తిరుచానూరు, సర్వే నం. 234 కు చేరియున్నభూమి 'టేకు పోరంబోకు' గా ప్రకటించిన విషయం చెప్పనవసరం లేదు, మరియు ఎల్.ఎ. ఏక్టు 1956, సెక్షన్ 2 - A క్రిందికి చేర్చబడినది, అటువంటి సామాజిక భూములు రైతువారీ పట్టాలు జారీ చేయుటకు అందుబాటు లేవు. ఇట్టి విషయాన్ని, హైకోర్టు న్యాయమూర్తులు గౌరవనీయులు జస్టిస్ లింగరాజు రథ్ మరియు గౌరవనీయ జస్టిస్ వై. వెంకటాచలం, వారి 09.11.1994 నాటి రిట్ అప్పీలు 193/90 తీర్పు ద్వారా నిర్ధారించినారు. అంతేకాక 1980లో, ఐ.డి.టీ, చంద్రగిరి వారు ఇచ్చినారని చెప్పబడుతున్న అట్టి రైతువారీ పట్టాలు ఐ.డి.టీ అధికారక వస్త్రాలలో కనుపించుట లేదు మరియు అట్టి విషయాన్ని హైకోర్టులో కౌంటరు ఎఫిడవిట్ ద్వారా, ఐ.డి.టి వారు వాంగ్మూలము సమర్పించినారు.

పై చెప్పిన దాన్ని దృష్టిలో వుంచుకుని, నా అభిప్రాయం ఏమంటే, పీటీషనరు సమర్పించిన పత్రములు. నిర్వర్తించుటకు కావల్సిన సాక్ష్యము, ఆధారము అధికారిక