పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8


9: 10వ తేదీ డిశంబరు 1956 సం.లో 1956 చట్టం దేశాధ్యక్షుని సమ్మతి లభించనప్పటికీ, 14వ తేదీ డిశంబరు 1956 సం.లో అధికారిక రాజ పత్రంలో ముద్రించబడినది, వెనువెంటనే అమలులోకి వచ్చినది, వెనువెంటనే అప్పీలు దారులు కాని/మరియు ఆసక్తి కల పూర్వీకులు గానీ రౌతువారీ పట్టా కొరకు, దరఖాస్తు చెయ్యలేదు.

కేవలం 1980 సం.లోగానీ, సుమారుగా గానీ, సర్వేపల్లి రామయ్య, మృతుడు,

అటువంటి రెండు ప్లాట్లకు, రైతువారీ పట్టా కొరకు దరఖాస్తు చెయ్యలేదు.

10: చిత్తూరు, డిప్యూటీ కలెక్టరు 29వ తేదీ సెప్టెంబరు 1980 సం.లో సర్వేపల్లి రామయ్య మృతుడుకు ఆరు ఎకరాలకు రైతువారీ పట్టా జారీ చేసినట్లుగా, అప్పీలు దారుల వాదన.

11: అప్పీలు దారుల వాదన ప్రకారం, ఇనాము డెప్యూటీ తాసిల్దారు, వేరొక ఉత్తర్వు ద్వారా, నాల్గవ తేదీ డిశంబరు, 1980లో, సర్వేపల్లి రామయ్య మృతుడుకు ఐదు ఎకరాలకు, పట్టా ఇవ్వటం జరిగింది.

12: సబ్ సెక్షన్ (3) కి లోబడి, ఇనాము డెప్యూటీ తాసీల్దారు ఉత్తర్వు ప్రకారం, మరియు 1956 ఏక్టునందలి సెక్షన్ (3)కి లోబడి, సబ్ సెక్షన్ (4) కి లోబడి రెవెన్యూ కోర్టు వారి అంతిమ తీర్పు వలన, 3వ తేదీ సెప్టెంబరు, 1984, చిత్తూరు జిల్లా రాజ పత్రంలో సర్వే నం.234, తిరుచానూరు, పెద్ద చెరువు పోరంబోకు (చెరువు)అని ప్రచురించుట ద్వారా, ప్రకటన ఐనది.

13: ఇట్టి ప్రకటనను, అప్పీలుదారుడు, వారి పూర్వీకులు లేటు సర్వేపల్లి రామయ్య సవాలు చేయలేదు. కానీ కొందరు ఇతరులు హైకోర్టులో ప్రశ్నించారు కానీ, హైకోర్టు దానిని రద్దు చేయలేదు.

14: భావించిన రైతువారీ పట్టా, జారీ చేసిన పూర్తి పది సంవత్సరములు తదుపరి, సర్వేపల్లి రామయ్య, మృతుడు, రిట్.నెం. 2759/1990, అట్టి పట్టాను అమలు పరుచుటకు వేసినారు. 19.03.1990 సం.లో, మాన్యులు ఏకసభ్య న్యాయమూర్తి, అట్టి పట్టాను, అవి నిజంగా సరియైనవని కనుగొనిచో, అమలు చేయమని, కేసు పరిష్కరించినారు.

15: పైన పేర్కొన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల వలన, తిరుపతి (రూరల్, మండల రెవెన్యూ అధికారి, సర్వేపల్లి రామయ్య, మృతుడు కు జారీ చేసిన పట్టా అమలు పరచుటకు, కలెక్టరును కోరగా, కానీ అనుమతి నిరాకరించుట జరిగినది.

16: తదుపరి, సర్వేపల్లి రామయ్య, మృతుడు, రైతు వారీ పట్టా అమలుకు ఆర్డరు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ నెంబర్లు 29664 & 29665/1995 దాఖలు చేసినారు.