పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానము
సివిల్ అప్పిలేట్ జ్యూరిస్ డిక్షన్
సివిల్ అప్పీలు నంబరు 7461/2009

సర్వేపల్లి రామయ్య (మృతుడు), వారసులు మరియు ఇతరులు,

- అప్పీలుదారులు

మరియు

జిల్లా కలెక్టరు, చిత్తూరు, మరియు ఇతరులు,

- ప్రతివాదులు

తీర్పు:

ఇందిరా బెనర్జీ. జె.

1: నేను, గౌరవనీయులు సోదరి, తీర్పు ప్రతిని పూర్తిగా ఆకళింపు చేసుకుని, నేను సంపూర్ణ అంగీకారముతో, ఇట్టి అప్పీలు కొట్టి వేయ తగినది. నేను, నా సోదరి, తీర్పు ముగింపు విషయములో ఏకాభిప్రాయంతో వున్నప్పటికీ, దానికి, నా స్వంతమైన అట్టి కారణములు చెప్పదల్చుకున్నాను.

2: అప్పీలుదారుని, కేసు ఏమనగా, 31.12.1940 లో అసలు రిట్ పిటీషనరు, లేటు సర్వేపల్లి రామయ్య, తండ్రి లేటు సర్వేపల్లి పొట్టయ్య, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా తిరిచానూరు గ్రామంలో సర్వే నం. 234లో రెండు ప్లాట్ల భూమికి 'శాశ్వతపట్టా' పొందియున్నారు. ధర చెల్లించి, హాతీ రాంజీ మఠం, మహంతు నుండి ఒక ప్లాటు 6 ఎకరాలు, వేరొకటి 5 ఎకరాలు. 3: అప్పీలుదారుని ప్రకారం, లేటు సర్వేపల్లి పొట్టయ్య, శాశ్వతపట్టాగా ఇచ్చిన తాకీదు, అట్టి తాకీదు భూమి 'పుంజా మన వారి అగరికల మిట్ట చేను' అనగా వ్యవసాయ మెట్టభూమి. అట్టి తాకీదు అమలును ప్రతివాదులు విభేదించారు.

4: 1940 సం.నుండి, సర్వేపల్లి రామయ్య/ అతని పూర్వీకులు నిరాటంక స్వాధీనంలో అనుభవించుచూ, అట్టి 11 ఎకరాల అనగా రెండు భాగాలు సాగుచేసుకునుచున్నారని వాదన.

5: ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ప్రాంత) ఇనాము (రద్దు మరియు రైత్యారీగా మార్పు) ఏక్టు 1956, ఇక ముందు 1956 ఏక్టుగా వ్యవహరించి, ఇనాము భూములు రద్దు మరియు కొన్ని ఇనాము భూముల ఆంధ్రప్రదేశ్ లోని (ఆంధ్ర ప్రాంతంలో) రైతువారీగా మార్పుటకు చట్ట బద్ధీకరణ చేయబడినది.