పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

భూమి 'మెట్ట'గా వర్గీకరించిన విషయంపై, ఎక్కువగా ఆధారపడటం జరిగింది. చట్టంలోని నిబంధనల ప్రకారం, ఇనాం డెప్యూటీ తాశిల్దారు, ఇనాము భూములను మాత్రం ఫారం 1 నోటీసు ఇచ్చి, ఫారం II ద్వారా, అట్టి భూములు ఒక సంస్థ ఆధీనంలో వున్నదీ లేనిది నిర్ణయించాలి. ప్రతివాది-ప్రభుత్వం ప్రకారం, ఇనాము డెప్యూటీ తాశిల్దారు, ఆంధ్రప్రదేశ్, ఇనాము (రద్దు మరియు రైతువారీ మార్పు) చట్టం 1956 లో విధించిన పద్ధతిని అనుసరించలేదు. సరాసరిగా, జిల్లా గెజిట్ 19వ పేజీలో, సర్వే నంబరు 234లోని 54.00 ఎకరాల భూమిని 'ఇనాం మెట్ట'గా ప్రకటించుట, చట్ట వ్యతిరేకము, మరియు చెల్లదు. చిత్తూరు జిల్లా గెజిట్లో ఇవ్వబడిన కేవలం ప్రకటన సమాజభూములపై, అటువంటి చెల్లని ప్రకటనలు ఆధారంగా, ఎవ్వరూ హక్కు కోరరాదు.

13: జిల్లా కలెక్టరు, 03.09.1984 నాటి గెజిట్ ప్రకటనను సూచిస్తూ, అట్టి ప్రకటన ప్రకారం సర్వే నంబరు. 234లోని 113.67 ½ ఎకరాల భూమి 'పెద్దచెరువు టేంకు'గా ప్రకటించుట వలన, ఎటువంటి విస్తీర్ణతల భూమి రైతు వారీ పెట్టా ఇచ్చుటకు అందుబాటులో లేవు. హైకోర్టు గుర్తించినట్లుగా, 03.09.1984 గెజిట్ ప్రకటనను, జిల్లా కలెక్టరు తన ఆర్డరులో పేర్కొన్నప్పటికీ, అప్పీలు దారుడు చెప్పబడిన గెజిట్ ప్రకటనను సవాలు చేయలేదు. డివిజన్ బెంచి, 22.02.2006 నాటి తీర్పులో సర్వే నంబరు 234 లోని భూమిని 'పెద్దచెరువు టేంకు' పోరంబోకు గా గెజిట్ ప్రకటనలో పేజీ నెంబరు 20 లో వున్న అతి ముఖ్యమైన అంశాన్ని దాచిపెట్టిన వైనంపై, అప్పీలుదారుని ప్రవర్తనపై విస్తారంగా ప్రస్తావించినారు. సాక్ష్యాధారాల ఆధారంగా, హైకోర్టు, జిల్లా కలెక్టరు ఉత్తర్వులు రద్దుకు తిరస్కరిస్తూ, ఇచ్చిన నిర్ణయం సక్రమమైనదే సవాలు చేయబడిన తీర్పులో ఎటువంటి లోపములు మా దృష్టిలో లేనందున, ఎటువంటి జోక్యమూ అవసరం లేదు.

ఫలితంగా అప్పీలు కొట్టి వేయబడినది.

....................J

ఆర్. భానుమతి

న్యూఢిల్లీ, 14.03.2019

గమనిక: స్థానిక భాషలో అనువదించబడిన తీర్పు, అతడు/ఆమె యొక్క స్థానిక భాషలో అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమతము. ఇది ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు. అనువదించిన స్థానిక భాష తీర్పు మూలము ఆంగ్లమున గల తీర్పు ప్రామాణికమైనది.