పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

కూడ చెల్లవనియు, ప్రకటించినారు. అప్పటి జిల్లా కలెక్టరు చిత్తూరు, 28.07.1994 నాటి ఆర్.ఒ.సీ.ఇ2/201/1990, 23.08.1994 ఆంధ్రజ్యోతి తెలుగు దిన పత్రికా ప్రకటన ద్వారా అప్పటి ఇనాము డెప్యూటీ తాశీల్దారు శ్రీ షేక్ చిన కాసుమయ్య అక్రమ పట్టాలు జారీ చేసినారనియు అవి మోసపూరితమైనవి, చెల్లవని, ప్రకటించినారు. 23.08.1984 నాటి పత్రికా ప్రకటనలో, 29.09.1980 నాటి ఐ.ఇ.నెం.303/77 తో ఇవ్వబడినట్లుగా చెప్పబడి, ఈ కేసులో అప్పీలుదారులు ఆధార పడుతున్నారో, అట్టి దానిని అప్పీలు దారుడు సర్వేపల్లి రామయ్యపేరుతో 23.08.1984 నాటి పేపరు ప్రకటనలో సీరియల్ నెంబరు 1 (ఒకటిగా) గా చూపబడినది.

10: ఇక్కడ గుర్తించవల్సిన విషయం ఏమనగా ఏ డాక్యుమెంటు ఆధారంగా భూమి మీద హక్కు కోరుచున్నాడో, అట్టిది 31.12.1940లో శ్రీ హాతీ రాంజీ, మఠం, తిరుపతి వారు ఇచ్చినట్లు చెప్పబడుతున్న తాకీదు ప్రతివాదుల వాదన ప్రకారం తిరుపతి శ్రీ హాతీ రాంజీ, మఠం వారికీ అటువంటి భూమిపై తాకీదు గానీ, శాశ్వత పట్టాను గానీ ఇచ్చే హక్కు లేనే లేదు. చాలా కేసులలో, గమనించినది ఏమంటే, హాతీ రాంజీ, మఠం వారు, అట్టి తాకీదు గాని, శాశ్వత పట్టాలు గానీ ఎన్నడూ ఇవ్వలేదు. అవి పుట్టించబడినవని లేదా కల్పితములు మరియు అప్పీలు దారులు ఆధారపడుతున్న శాశ్వత పట్టా చెల్లదు, ఆధారపడ దగ్గ డాక్యుమెంటు కాదు.

11: డాక్యుమెంట్లు పరిశీలించిన మీదట, డెప్యూటీ తాశిల్దారు రిపోర్టును బట్టి, అప్పీలుదారుడు సర్వే నం. 234 లోని భూమిపై, కల్పిత పత్రాలు ఆధారంగా, భూమిపై హక్కు కోరుచున్నట్లుగా, అవి ఇనాము డెప్యూటీ తాశిల్దారు, చంద్రగిరి, అధికార రికార్డులో, లేవని జిల్లా కలెక్టరు నిర్ధారించినారు. 03.09.1984 నాటి అధికారికి జిల్లా గెజిట్ నెం. 9, ప్రకటించినట్లుగా, తిరుచానూరు గ్రామంలోని సర్వే నం.234 లోని మొత్తం 113.67 ½ ఎకరాల మొత్తం భూమిని, ఇనాము ఎబోలిషన్ ఏక్టు, సెక్షన్ 2- A లో బడి, “పెద్దచెర్వు టేంకు" గా వర్గీకరించబడినదని జిల్లా కలెక్టరు సరిగానే చెప్పుట జరిగింది. జిల్లా కలెక్టరు సరియైనట్లుగా చెప్పినట్లు, సర్వే నంబరు 234లో గల మొత్తం విస్తీర్ణం భూమిని 'టేంకు భూమిగా వర్గీకరణ జరిగిన సంధర్బంలో ఇనాము రద్దు చట్టం లోబడి రైతువారీ పట్టా మంజూరుకు ఎట్టి భూమీ లభ్యతలో లేవు మరియు రైతు వారీ పట్టా ఇచ్చే ప్రశ్న లేదు. అట్టి భూమి పెద్ద చెరువు టాంకుగా వర్గీకరించబడుటవలన అది ప్రభుత్వానికి చెందుతుందని, సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచి, తమ న్యాయమైన తీర్పు ద్వారా, ఇనాము రద్దు ఏక్టు సెక్షన్ 2- A కి లోబడి, నిషేధం వలన, రైతు వారీ పట్టాలు జారీ చేసే ప్రశ్న తలఎత్తదు. అని చెప్పటం జరిగింది.

12: అప్పీలు దారుల తరపున, 03.09.1984 నాటి గెజిట్ ప్రకటనలో పేజీ నంబరు 9లో, ఫారమ్ II సబ్ సెక్షన్ (3), ఇనాము రద్దు చట్టం లో బడి సర్వే నంబరు 234 నందలి, 54.00 ఎకరాల