పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

సవాలుచేయలేదు కనుక, అట్టి ఆర్డరులు అంతిమ తీర్పులేనని వాదించినారు, మరియు, రైతువారీ పట్టాకు ఉత్తర్వులు ఇస్తూ, ఇనాము తాశిల్దారు ఇచ్చిన ఆర్డరు విషయంలో, ప్రతివాదులు విరుద్ధమైన వైఖరి అవలంభించారు. హైకోర్టు ఆర్డరు రీత్యా, దర్యాప్తు కొనసాగించుటలో, కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించలేదని, అట్టి జిల్లా కలెక్టరు ఆర్డరును రద్దుచేయకుండా, హైకోర్టు పొరపాటు చేసిందని, వాదించారు.

7: ప్రభుత్వ వకీలు తమ వాదన వినిపిస్తూ, 03.09.1984 నాటి, చిత్తూరు, జిల్లా గెజిట్ నందు సర్వే నం.234లో వున్న 113.67½ ఎకరాల భూమిని 'పెద్దచెరువు టేంక్' పోరంబోకుగా వర్గీకరణ చేయుట జరిగినదనియు, మరియు అట్టి గెజిట్ ప్రకటనకు ముందు వున్న ఎటువంటి పట్టాలుగానీ, ఎటువంటి భూమికి గాను ఎవరి దగ్గర వున్నా, అవి లేనట్టేనని మరియు చెల్ల నేరవని, చెప్పినారు. ఆధారాలను పరిగణిస్తూ, జిల్లా కలెక్టరు, అట్టి భూమి 'టేంక్' పోరంబోకు'గా వర్గీకరణ చేయబడిన దన్న , వారి ఆర్డరు సరియైనదేననియు, అప్పీలు దారుడు ఆ భూమిపై హక్కుకోరరాదనియు, పైగా వారు 03.09.1984 నాటి గెజిట్ ప్రకటనను, సవాలు చేయలేదు.

8: చిత్తూరు జిల్లా, తిరుపతి రూరల్ మండలానికి చెందిన తీరుచానూరు గ్రామం మైనర్ ఇనాము గ్రామం ఐనందున, ఇది ఆంధ్రప్రదేశ్ ఇనాము (ఎబోలిషన్ & కన్వర్షన్ ఇన్ టు రైతువారీ) ఏక్టు, 1956 (ఇనాము ఎబోలిషన్ ఏక్టు) లోబడి వుంటుంది. ఇట్టి గ్రామంలోని సర్వే నం. 234 లో గల మొత్తం భూమి 'పెద్దచెరువు టేంక్ పోరంబోకుగా వర్గీకరించబడినది. అన్ని సామాజిక ప్రభుత్వ పోరంబోకు భూములు ఇనా ఎబోలిషన్ చట్టం, సెక్షన్ 2 - Aకి చేరి వుంటాయి. ఈ భూములు, చట్టానికి లోబడి, ఎట్టి వ్యక్తులకు గాని రైతు వారీ పట్టాలు ఇచ్చుటకు లభ్యముగాలేవు. ఇది ఇనాము గ్రామం ఐనందున, కలెక్టరు ఆఫీసునందలి అప్పటి ఇనాము డెప్యూటీ తాశీల్దారు, చిత్తూరు, మొత్తం 113-67½ ఎకరాల భూమిని ఇనాము రద్దు చట్టం సెక్షను 3 - ఎ క్రింద, పేజి 20 లో, 03.09.1984 నాటి జిల్లా గెజిట్ లో 'టేక్' పోరంబోకు' గా ప్రకటించుట జరిగినది. ఇనాము తాశిల్దారు సదుద్దేశంతోనే, పైన చెప్పిన విషయం గుర్తించక, పొరపాటున, సర్వే నం.234 లోని 54.00 ఎకరాల భూమిని, చిత్తూరు జిల్లా గెజిట్, 03.09.1984 నాడు పేజీ 19లో 'ఇనాము మెట్ట' గా చెప్పుట జరిగింది, కానీ అది చెల్లదు.

9: ఇంతకు ముందు గుర్తించినట్లుగా, 29.09.1980 మరియు 14.12.1980 నాటి ఉత్తర్వులు ఆధారంగా, రైతు వారీ పట్టా జారీ గురించి, అప్పీలు దారుడు కోరుచున్నాడు. 20.06.1990లో, ఆర్.ఒ.సి.నెం.213/89 గల ఉత్తర్వు ద్వారా, మండల రెవెన్యూ ఆఫీసరు వివరణ కోరగా, జిల్లా కలెక్టరు, 14.03.1991 లో ఆర్.ఒ.సి.నెం.B.00701/1990 ద్వారా, 12.03.1991 ఆంధ్రజ్యోతి దిన పత్రిక ప్రకటన ద్వారా, చిత్తూరు జిల్లా, చంద్రగిరి, ఇనాము డెప్యూటీ తాశీల్దారుగా శ్రీ షేక్ కాసుమయ్య గారు వుండగా జారీ చేసిన రైతు వారీ పట్టాలు చెల్లవనియు, క్రయ దస్తావేజులు