పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ఆచరణ పెట్టు, విషయంలో వివరణ కోరుతూ జిల్లా కలెక్టరును, అడిగినారు. జిల్లా కలెక్టరు ఆచరణకు అనుమతి ఇవ్వలేదు. పైగా, 14.03.1991 నాటి ఆంధ్రజ్యోతి, తెలుగు దినపత్రికలో ఆర్.ఒ.సి.నెం.బి9.00701/1980, 12.03.1991 తేదీ గల ప్రకటన ద్వారా, చిత్తూరు జిల్లా, చంద్రగిరిలో, శ్రీ షేక్ కాసుమయ్య గారు, ఇనాము డెప్యూటీ తాసిల్దారుగా, 1980వ సం.లో జారీ చేసిన రైతు వారీ పట్టాలు, మరియు తదుపరి విక్రయ పత్రాలు చెల్లనేరవని ప్రకటించినారు.

4: రైతు వారీ పట్టా ఆచరణకు, జిల్లా కలెక్టరు అనుమతి ఇవ్వనందున, అప్పీలు దారుడు రిట్ పీటీషన్ నెం. 29664 & 29665/1995 వేసినారు, అందులో గత రిట్ నెం. 2759/1990 సమర్పించిన అంశములనే తిరిగి వేయటం జరిగినది. జిల్లా కలెక్టరుకు, విచారణ జరిపి, అప్పీలుదారునకు అవకాశం ఇస్తూ, సరియైన ఆర్డరు ఇవ్వవల్సిందిగా, 28.11.2001లో రిట్ పిటీషన్లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. అప్పీలు దారునికి అవకాశం ఇచ్చి, విచారణ నిర్వహించి జిల్లా కలెక్టరు జనవరి 2003లో ఆర్డరు ఇస్తూ, 03.09.1984లో ఇచ్చిన ప్రకటన ప్రకారం, సెక్షను 2 - A కి లోబడి ఇట్టి భూమి 'పెద్దచెరువు టేంక్'గా వర్గీకరణ చేయుబడుట వలన, అప్పీలు దారుడు పట్టా జారీకొరకు చేసిన దరఖాస్తు తిరస్కరించబడినది మరియు సర్వేపల్లి రామయ్యకు, డెప్యూటీ తాసిల్దారు ఇచ్చిన పట్టాలు కల్పితమైనవని, ఆర్డరు ఇవ్వడమైనది.

5: జిల్లా కలెక్టరు ఆర్డరును సవాలు చేస్తూ, అప్పీలుదారులు వేసిన రిట్ నెం. 5807/2003ను, సింగిల్ జడ్జి కొట్టి వేస్తూ, జిల్లా కలెక్టరు, పట్టా స్వభావం గురించి, రికార్డుచేసిన విషయములు అవి నకిలి పట్టాలని నిర్ధారించినది. ఖచ్చితమైన ఆధారాలను గుర్తించినదిగా, వెల్లడించినారు. సింగిల్ జడ్జి, దీనికి కొనసాగింపుగా, ఇనాము రద్దు ఏక్టు, సెక్షను 2 - A కి లోబడి, అందలి నిషేధానికి లోబడి టేంక్ బెడ్ భూములు అవి ప్రభుత్వానికి చెందును. పరాధీనముగాని, స్వాధీనముగాని చేయరాదు, అని వెల్లడించినారు. అప్పీలులో డివిజను బెంచి, గౌరవ సింగిల్ జడ్జి ఆర్డరును నిర్ధారించుచూ, 'పెద్దచెరువు టేంక్'గా వర్గీకరించబడిన భూములు, సెక్షను 2 - A, ఇనాము రద్దు ఏక్టుకు లోబడి, అందున్న నిషేధము దృష్ట్యా, వాటిని బదలాయించుటకూడదు. కొనసాగింపుగా, డివిజన్ బెంచి, ఇనాము రద్దు ఏక్టుకు లోబడి, 03.09.1984లో ఇచ్చిన ప్రకటనను అప్పీలు దారుడు సవాలు చేయలేదు, కలెక్టరు ఇచ్చిన ఆర్డరులో, 03.09.84 గెజిట్ ప్రకటనలో పేజీ నెం.20 లో నమోదైన ఎంట్రీ గూర్చి ప్రత్యేక సూచన చేస్తూ, ఆ సర్వే నం.234 లోని భూములు పెద్ద చెరువు టేంకు, చెప్పినప్పటికీ, అటువంటి గెజిట్ ప్రకటనను సవాలు చేయకుండా, కలెక్టరు ఆర్డరును రద్దు చేయమని కోరరాదు.

6: అప్పీలుదారుని సీనియర్ అడ్వకేటు శ్రీ ఎస్. గురుకృష్ణ, తన వాదన వినిపిస్తూ, 29.09.1980 మరియు 04.12.1980 నాటీ ఆర్డరులలో, అప్పీలు దారునికి అనుమతించిన రైతు వారి పట్టా ఉత్తర్వులను, ఏక్టు, సెక్షన్ 3(4) లోబడి, చట్టరీత్యా, ప్రభుత్వంగాని, ఏ ఇతరులుగాని