పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

రికార్డులలో లేనే లేదు, తిరుపతి రూరల్ మండలంలోని, తిరుచానూరు గ్రామానికి చెందిన సర్వే నం.234 లోని భూమి లభ్యతలో లేదు. అందుచేత, కల్పిత రికార్డులపై ఇవ్వబడినట్లు చెప్పబడుతున్న రైతువారీ పట్టాను ఆచరణలో పెట్టుట అనే ప్రశ్న తలెత్తదు. గౌరవ హైకోర్టు రిట్. నెం. 29664 & 29665/95 లలో 28.11.2001 లో

ఇచ్చిన ఒకే ఆదేశానికి ఖచ్చితమైన, ఆచరణతో, ఇట్టి ఉత్తర్వు జారీ చేయబడినది.

20: ఇట్టి కలెక్టరు ఉత్తర్వులను సవాలు చేస్తూ, సర్వేపల్లి రామయ్య, మృతుడు, ప్రశ్నించిన రిట్ నెం.5807/2003, 23.04.2003 నాటి ఆర్డరులో, గౌరవనీయ సింగిల్ బెంచి, హైకోర్టు, తిరస్కారపూర్వకంగా కొట్టివేయ బడినది. ఇట్టి ఆర్డరు పై, లేటు సర్వేపల్లి రామయ్య వేసిన అప్పీలు కూడా, డివిజను బెంచి, 22.02.2006 తీర్పులో కొట్టి వేయబడినది.

21: సింగిల్ బెంచి కొట్టి వేస్తూ, రిట్లో ఇచ్చిన ఆర్డరును, సమర్ధిస్తూ 22.02.2006 లో డివిజన్ బెంచి ఇచ్చిన తీర్పులో ఎట్టి లోపములు గాని అట్టి అప్పీలలో కలుగ చేసుకోటానికి గాని లేదు.

22: పట్టాకు సంబంధించి, సంబంధిత రిజస్టరులో ఎట్టి నమోదులు లేని కారణంగా, ఇవ్వబడినదిగా చెప్పబడుతున్న రైతువారీ పట్టాను, దాని నిజాయితీని ప్రశ్నించిన కలెక్టరు ఆర్డరు పై వేసిన రిట్ పిటీషన్ ను నా దృష్టిలో, సింగిల్ జడ్జి సక్రమమైన రీతిలో, వ్యాజ్యానికి తిరస్కరించినట్లే.

1940 సం.లో మఠం, మహంతే శాశ్వత పట్టాను ఇవ్వటం తాకీదు జారీ చేయుట వివాదాస్పదమైనవి. గౌరవనీయ నా సోదరీమణి గమనించినట్లుగానే, ఇవ్వబడినట్లు చెప్పబడుతున్న చట్ట విరుద్దమైన రైతు వారీ పట్టాలు, వాటిని జారీ చేసిన ఇనాము డెప్యూటీ తాసిల్దారుపై తీవ్రమైన ఆరోపణలు వున్నవి.

పై పెచ్చు, జారీ చేయబడినవి చెప్పబడుచున్న ఈ పట్టాలు, 1956 ఏక్టు, సెక్షన్ 7 క్రింద చేర్చబడిన ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రాంత (ఇనాము ఎబోలిషన్ & కన్వర్షన్, రైతువారీ లోకి) రూలు 57 ప్రకారం ఇవ్వవలసిన దర్యాప్తుకు, నోటిసు విధించిన ఫారంలో ఇవ్వటం జరుగలేదు. అంతేకాక, మొత్తం సర్వే నం. 234 ‘టెంకు పోరంబోకు' గా ప్రకటించబడి, సెక్షన్ 2-A లో చేర్చబడినది. అందుచే అది పరాధీనము చేయుటకు వీలుకానిది.

23: పరిపాలన సంబంధింత నిర్ణయములు, న్యాయపరమైన రాజ్యంగములో ఆర్టికల్ 226 లో బడి, పునర్విక్షణకు లోబడి విరుద్ధమైన, న్యాయ వ్యతికరమైన, నిర్ణయము తీసుకొనుటకు కావల్సిన అధికారము, పద్ధతి పాటించుటలో అవకతవకలు వంటి కారణములు సందర్బములో మాత్రమే వుండును. ఇట్టి ఆధారములు క్రింద మాత్రమే, న్యాయపరమైన,