పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/1

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానము
సివిల్ అప్పిలేట్ జ్యూరిస్ డిక్షన్
సివిల్ అప్పీలు నంబరు 7461/2009

సర్వేపల్లి రామయ్య (మృతుడు), వారసులు మరియు ఇతరులు,

- అప్పీలుదారులు

మరియు

జిల్లా కలెక్టరు, చిత్తూరు, మరియు ఇతరులు,

- ప్రతివాదులు

తీర్పు:

ఆర్.భానుమతి, జె.

1. 22-02-2006 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటీషన్ నెం. 1495/2004 లో, అప్పీలు దారులకు జిల్లా కలెక్టరు రైతువారీ పట్టా జారీ చేయుటకు తిరస్కరిస్తూ ఇచ్చిన సింగిల్ జడ్జి ఆర్డరును, స్థిరపరుస్తూ, డివిజన్ బెంచి ఇచ్చిన ఆర్డరుపై ప్రస్తుత అప్పీలు వెలువడినది.

2. వారి పూర్వీకులు, 13.12.1940 లో, శ్రీ హాతీరాంజీ మఠం నుండి టి. డి.నెం. 464 గల 6.00 ఎకరాల విస్తీర్ణం గల మెట్ట భూమికి శాశ్వత పట్టాను పొందియున్నారని, మరియు అప్పటి నుండి వారి ఆధీనంలోనే వున్నదని, అప్పీలు దారుల కేసు, సర్వే నం.234 నందలి ఇనాము నం.464 లోబడిన 6.00 ఎకరాల విస్తీర్ణం గల భూమికి 29.09.1980 తారీఖు గల రైతువారీ పట్టాను పొందినామని అప్పీలు దారుల కేసు అదేవిధంగా, అప్పీలు దారులు 14.12.1980 లో ఇనాము నెం.464, సర్వే నం.234 సంబంధించి 5.00 ఎకరాల విస్తీర్ణం గల వేరొక పట్టాను పొందియున్నారు. అప్పీలు దారులు శ్రీ సర్వేపల్లి రామయ్య, 29.09.1980 నాటి డిప్యూటీ తాసిల్దారు ఉత్తర్వులు ద్వారా పొందిన పట్టాను, రెవెన్యూలో ఎంట్రీలు వేసి, ఆచరణలోకి పెట్టుటకు తిరుపతి, రూరల్, తాశిల్దారుకు ఉత్తర్వులు కోరుతు రిట్ నెం. 2759/1980, హైకోర్టులో వేసినారు. ఇట్టి రిట్ పిటీషన్ ను హైకోర్టు, 19.03.1980 నాటీ ఆర్డరులో, అధికారులను, సంబంధిత రికార్డుల వలన సంతృప్తులైన, యెడల, అట్టి పట్టా అసలైనదా కాదా పరిశీలించి, అసలైనదైతే దానిని ఆచరణలో పెట్టాలని, ఉత్తర్వులు ఇవ్వబడినవి. .

3: 20.06.1990 తేదీ గల ఆర్.ఒ.సీ.సీ.213/89 ద్వారా, తిరుపతి, రూరల్, మండల రెవెన్యూ ఆఫీసరు, అప్పీలుదారుడు సర్వేపల్లి రామయ్యకు రైతు వారీ పట్టా జారీ చేస్తూ ఇచ్చిన ఆర్డరును