పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/114

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

113


క.

ప్రాణాపానవ్యానో
దానసమానములు దృప్తి దలకొనజేయం
గా నోపెడునది యన్నమ
ప్రాణం బన నన్న మనగఁ బర్యాయంబుల్.

5

కాశీఖండము

2 లక్షణము

క.

స్వరగణమయ్యు ఋకారము
బరికింపఁగ రేఫతోడఁ బ్రాసంబగుచుం
గర మొప్పు వట్రసుడి యు
బ్బరముగఁ బెరహల్లుతోడఁ బ్రాస మగు శివా.

6

ఋకారరేఫలకు

క.

ఆఋషికుమారు గట్టిన
చీరలు మృదులములు కడువిచిత్రములు మనో
హారము లతనిబృహత్కటి
భారమునం దొక్కకనకపట్టము వ్రేలున్.

7

ఆరణ్యపర్వము

వట్రసుడికి

క.

[1]చావరు నొవ్వరు పాండవు
లేవురు నని నీవు చెప్ప నిప్పలుకులు దుః
ఖావేశకరములై చో
తోవృత్తి దహింపఁజొచ్చె దుర్భరభంగిన్.

8

కర్ణపర్వము

  1. చావరు, ఈకృష్ణుని ఈరెండుదాహరణములు వ్యర్థములు.