6
ఉపోద్ఘాతము
యుండ మనస్సునకుమాత్రము వ్యాపారము గలిగి యుండునపుడు నానాస్వప్నములు గలుగును.)
ఇట్లు గలిగెడిస్వప్నములును,
| "దృష్టశ్శ్రుతో౽నుభూతశ్చ ప్రార్థితః కల్పితస్తథా, | |
(1. పగలు గనినవస్తువు రాత్రి నిద్రలోఁ గనఁబడినచో దృష్టస్వప్నము, 2. ఇదివఱకు వినినమాట నిద్రలో వినఁబడినచో శ్రుతస్వప్నము, 3 మేలుకొనినపుడు దా ననుభవించినవస్తువులు నిద్రలో ననుభవించినచో అనుభూతస్వప్నము, 4 మేల్కొనినపుడు కోరిన వస్తువును నిద్రలోఁ జూచినచోఁ బ్రార్థితస్వన్నము, 5 పగలు కల్పించినవస్తువు రాత్రి నిద్రలో గనఁబడినచోఁ గల్పితస్వప్నము, 6 ఇదివఱ కెప్పుడును నెఱుఁగనివస్తువును నిద్రలోఁ జూచినచో భావికస్వప్నము, 7 వాతపిత్తశ్లేష్మప్రకోపమువలన నిద్రలో నొకవస్తువును జూచినచో దోషజస్వప్నము.) అని యేడువిధము లని నిర్వచింపఁబడి తదంతర్భేదములు కావలసినన్ని పెరిఁగిపోయినవి. కనుక నంతర్జ్ఞానేంద్రియవ్యాపారము లున్నంతవఱకును స్వప్నములు గలుగుచుండుట నైజమే యని తలంచుటకు సందేహము లేదు. ఇది యొకబూటకమే గాని యందఱకును నొక్క మాదిరిస్వప్నములే గల్గునా? యని శంకించుటకు మనస్సు పాఱువోవచ్చును. అందఱకును గల్గు సంకల్పాదు లన్నియు నొక్క పోలికవేగాన నట్లు కలుగవచ్చునని సమాధానము చెప్పుట య టుంచి
| “ఏకవస్త్రః కుశాస్తీర్ణే సుప్తః ప్రయతమానసః, | |
(స్వప్నమును గోరువాఁ డేకవస్త్రధారి యై నిర్మలహృదయముతో దర్భాసనముపైఁ బరుండెనేని వేకువజామున శుభస్వప్నమును గాని యశుభస్వప్నమును గాని గాంచును) అని కావలెనని స్వప్నమును జూడవలె ననుకొన్న నిట్లు చేయవలసిన దని స్వప్నప్రకాశికలోనే చెప్పఁబడినది. ఇట్టపరిస్థితులలో సాంప్రదాయసిద్ధముగ వచ్చుచున్న