ఉపోద్ఘాతము
శ్రీకృష్ణభగవానుఁడు గీతలలో నత్యుత్కృష్టపదార్థమునుండి యతినికృష్టపదార్థమువఱకును గలవిశేషాంశములు తనస్వరూపముగా వేర్వేఱ విభజించి చెప్పుచుఁ జెప్పుచుఁ గట్టకడ కొక్కమాటలో బ్రహ్మాండ మంతయు నిమిడి పోవునట్లుగా
| “యద్య ద్విభూతిమత్సత్వం శ్రీమదూర్ణితమేవ వా | |
అని తన విశ్వరూపమును ప్రకటించి యున్నాఁడు. దీని బట్టి చూడఁ బ్రతివ్యక్తియందును భగవదంశ మంతో యింతో యిమిడియే యున్నదని చెప్పక తప్పదు. ఇట్టిచో వివేకవంతుఁ డగుపురుషునియెడ భగవదంశ మున్న దనుటలో సందియము లేదు. అంతో యింతో భగవదంశము కలవా రయ్యును దామసగుణసంభూతు లైనవారి విషయ మటుంచి సాత్త్వికులును, వివేకవంతులు నగు ప్రతివారును దాము జన్మ మెత్తినందుల కేదో యొకరూపమున సార్థక్యమును సంపాదింపవలెననియే యత్నించుచుందురు. ఆప్రయత్నములును నొక్కరూపములే గాక యనేకరూపములుగా నుండెడుఁ గానఁ దలాయొకరీతిని వారివారికిం గల ప్రజ్ఞావిశేషమును బట్టి పచరింపఁబడుచుండును. అట్టివానిలోఁ గృతి నిర్మాణ మొకటి. ఐహికాముష్మికసంపాదకము లగునన్నికార్యములలోను నియ్యదియే శాశ్వతము. కనుకనే ప్రపంచస్థాయి భావమున కిది యాధార మగుచున్నది. ఇప్పటి "కెన్నఁడో జరిగిన వైన నేమి నేఁటిదాఁక నాఁటిపరిస్థితులను గన్నులఁ గట్టినట్టు పొడకట్టఁ జేయున దిదియే యయ్యెఁగాని మఱొకటి గాదుగదా! అట్టి లోకోత్తరకార్య మొనరించి మృతజీవులై యున్న కవిమహాశయులలో సమీరకుమారవిజయ