ఈ పుట ఆమోదించబడ్డది

20

దుఃఖకరమైన ప్రకరణం - 2

భ్రష్టుణ్ణి చేయాలని దీక్ష వహించినందున మిత్రుడే డబ్బు ఖర్చు పెడుతూ వుండేవాడు. అతనికి మాత్రం మాటిమాటికీ అంత డబ్బు ఎట్లా లభిస్తుంది? అందువల్ల మా మాంసాహార విందుల సంఖ్య తగ్గిపోయింది.

దొంగతనంగా విందులు ఆరగించిన తరువాత నాకు ఆకలి వేసేది కాదు. యింటికి వచ్చి ఆకలి లేదని చెప్పవలసి వచ్చేది. మా అమ్మ అన్నానికి పిలిచేది. ఆకలి లేదంటే కారణం అడగకుండా వూరుకునేది కాదు “అన్నం అరగలేదు ఆందువల్ల ఆకలి కావడం లేదని” అబద్ధం చెప్పవలసి వచ్చేది. ఈ విధంగా అబద్ధాలు చెబుతున్నప్పుడు బాధగా వుండేది. అమ్మకు అబద్ధం చెబుతున్నాను అని కుమిలిపోయేవాణ్ణి. మా బిడ్డలు మాంసాహారులైనారని తెలిస్తే మా తల్లిదండ్రుల గుండెలు బ్రద్దలైపోతాయని నాకు తెలుసు. ఈ విషయాలన్నీ తలుచుకుని బాధపడుతూ వుండేవాణ్ణి.

మాంసభక్షణను గురించి హిందూదేశంలో ప్రచారం చేయడం ఎంతో అవసరం అన్నమాట నిజమే. కాని తల్లిదండ్రుల్ని మోసగించడం, వారికి అబద్ధం చెప్పడం సబబా? అందువల్ల వారు జీవించియున్నంతవరకు ఇక మాంసం తినకూడదు. నేను పెద్దవాణ్ణి అయిన తరువాత బహిరంగంగా తింటాను. ఈ లోపల మాంసభక్షణ విరమించి వేస్తాను అను నిర్ణయానికి వచ్చాను.

నా యీ నిర్ణయాన్ని మిత్రునికి తెలియజేశాను. తమ కొడుకులిద్దరూ మాంసాహారులైనారను విషయం మా తల్లిదండ్రులకు తెలియదు. మా తల్లిదండ్రుల ముందు అబద్ధాలాడకూడదని నిర్ణయించుకొని మాంసభక్షణ మానివేశానే కాని నా ఆ మిత్రుని సావాసం మాత్రం నేను మానలేదు. యితరుల్ని సంస్కరించాలనే కోరిక నన్ను నిలువునా ముంచి వేసింది. చివరకు ఆ సావాస ఫలితం యింతగా హానికారి అవుతుందని నేను అప్పడు ఊహించలేదు.

అతని స్నేహం నన్ను వ్యభిచార రంగంలోకి కూడా దింపేదే. కాని తృటిలో ఆ ప్రమాదం తప్పిపోయింది. ఒకరోజున అతడు నన్ను ఒక వేశ్య యింటికి తీసుకొనివెళ్ళాడు. కొన్ని వివరాలు చెప్పి నన్ను వేశ్య గదిలోకి పంపాడు. అవసరమైన ఏర్పాట్లు అదివరకే అతడు చేశాడు. యివ్వవలసిన సొమ్ము అదివరకే యిచ్చివేశాడు, నేను పాపపు కోరల్లో చిక్కుకుపోయాను. కాని భగవంతుడు నన్ను రక్షించాడు. ఆ పాపపు గుహలో నాకు కండ్లు కనబడలేదు, నోటమాట రాలేదు. పరుపు మీద నేను ఆమె ప్రక్కన కూర్చున్నాను. నా నోరు మూసుకుపోయింది. ఆమె చాలాసేపు ఓపిక పట్టింది. యిక పట్టలేక తిట్టడం ప్రారంభించింది. ద్వారం చూపించి వెళ్ళిపొమ్మంది. నా మగతనానికి అవమానం