ఈ పుట ఆమోదించబడ్డది

328

వకీలు వృత్తి కొన్ని జ్ఞాపకాలు

ఎందువల్లనో గాని మాకూ అక్కడవున్న ఆంగ్ల యాత్రికులకు మధ్య ఎంతో వ్యత్యాసం కనబడింది. ఇంత వ్యత్యాసం దక్షిణ ఆఫ్రికాలో నాకు కనబడలేదు. అక్కడ కూడా తేడా వుందికాని, యింత తేడా మాత్రం లేదని చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఆంగ్ల యాత్రికుల్ని కలిసినా “క్షేమంగా వున్నారా? వున్నాము” అంతటితో సంభాషణ ఆగిపోతూ వున్నది. మనస్సులు కలవలేదు. స్టీమరులోను దక్షిణ ఆఫ్రికాలోను మనస్సులు కలిసేవి. మేము పరిపాలకులం అని ఆంగ్లేయులు, మేము పాలితులం అని హిందూ దేశస్థులు తెలిసో తెలియకో భావించడం యిందుకు కారణమని గ్రహించాను. ఇటువంటి వాతావరణా న్నుండి త్వరగా బయటపడి దేశం చేరుకోవాలని తహతహలాడాను. అదస్ చేరాక యింటికి చేరినట్లనిపించింది. దక్షిణాఫ్రికాలో అదస్ ప్రజలతో నాకు సంబంధం ఏర్పడింది. అక్కడ భాయికైకోబాద్‌కావస్ దీన్షా డర్బను విచ్చేసినప్పుడు ఆయనతోను, ఆయన భార్యతోను నాకు బాగా పరిచయం ఏర్పడింది. తరువాత కొద్ది రోజులకు మేము బొంబాయి చేరాం. 1905 కే తిరిగి వద్దామనుకున్న దేశానికి పదిసంవత్సరాల తరువాత వచ్చానన్నమాట. ఎంతో ఆనందం కలిగింది. బొంబాయిలో గోఖలేగారు స్వాగత సత్కారాల నిమిత్తం ఏర్పాట్లు చేశారు. వారి ఆరోగ్యం సరిగా లేదు. అయినా వారు బొంబాయి వచ్చారు. వారిని కలుసుకొని, వారిజీవితంతో కలిసిపోయి నా బరువును తగ్గించుకోవాలనే కోరికతో బొంబాయి చేరాను. కాని సృష్టికర్త నా నొసట మరో విధంగా లిఖించాడు. 

44. వకీలు వృత్తి కొన్ని జ్ఞాపకాలు

హిందూ దేశం వచ్చిన తరువాత నా జీవనస్రవంతి ఎలా ముందుకు సాగిందో వివరించే ముందు దక్షిణ ఆఫ్రికాలో జరిగిన కొన్ని ఘట్టాలు యిక్కడ తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను. వాటిని నేను గతంలో కావాలనే వదిలి వేశాను. కొంత మంది మిత్రులు నా వకీలు జీవితపు అనుభవాలు తెలుపమని కోరారు. అట్టి జ్ఞాపకాలు కోకొల్లలు. వాటిని వ్రాయడం ప్రారంభిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. కొన్ని జ్ఞాపకాల్ని మాత్రం యిక్కడ తెలుపుతాను. వకీలు వృత్తిలో నేను ఆధారం చేసుకోలేదని మొదటనే తెలియజేశాను. నిజానికి నా వకీలు వృత్తితో ఎక్కువ భాగం సేవకే సమర్పించాను. జేబు ఖర్చుకు సరిపడే సొమ్ము మినహా మరింకేమీ తీసుకోలేదు. ఎన్నో పర్యాయాలు ఆ సామ్ముకూడా వదిలివేస్తూ వుండేవాణ్ణి. యింతటితో ఆపుదామంటే సత్యపాలనకోసం మీరు చేసిన వకీలు వృత్తిని గురించి ఏమి రాసినా ప్రయోజనం