ఈ పుట ఆమోదించబడ్డది

298

ఇంట్లో సత్యాగ్రహం

29. ఇంట్లో సత్యాగ్రహం

మొదటిసారి 1908లో నాకు జైలు ప్రాప్తి కలిగింది. జైల్లో ఖైదీల చేత అనేక నియమాల్ని పాటింపచేసేవారు. ఆ నియమాల్ని సంయమం కలిగిన వ్యక్తి లేక బ్రహ్మచారి స్వేచ్ఛగా పాటించాలని భావించేవాణ్ణి. ఉదాహరణకు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు అనగా అయిదు గంటలకు భోజనం చేయడం. హిందూ దేశస్థులకు హబ్షీ ఖైదీలకు టీ ఇవ్వకపోవడం, మొదలుగాగలవి. అక్కడి నియమాల ప్రకారం రుచి కోసం తినవలసిన పరిస్థితి లేనేలేదు. జైలు డాక్టరుకు హిందూ దేశస్థుల కోసం నూరిన మసాలాలు వాడమని, ఉడుకుతూ వున్నప్పుడే ఆహారపదార్థంలో ఉప్పు కలపమని చెప్పాను. “ఇక్కడికి మీరు జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు రాలేదు. ఆరోగ్య దృష్ట్యా కావాలంటే ఉప్పు విడిగా తీసుకున్నా లేక ఉడుకుతూ వున్నప్పుడు పదార్థాల్లో వేసినా రెండూ ఒకటే” అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఎంతో ప్రయత్నించిన తరువాత అక్కడ కొద్ది మార్పులు చేయగలిగాము. కాని సంయమం దృష్ట్యా రెండు నిబంధనలు సరి అయినవే. ఇలాంటి నిబంధనలు బలవంతంగా విధించకపోతే అమలుకావు. స్వేచ్ఛగా పాటిస్తే మాత్రం అవి ఎంతో ప్రయోజనకరమైనవి. జైలునుండి విడుదల అయిన తరువాత ఆ మార్పులు వెంటనే చేశాను. టీ తీసుకోవడం మానివేశాను. సాయంత్రం త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకున్నాను. ఈనాటివరకు ఆ అలవాటు అలాగే ఉండిపోయింది.

ఒకసారి ఉప్పును కూడా మానవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నియమం పది సంవత్సరాల వరకు నిరాటంకంగా సాగింది. ఆహారానికి సంబంధించిన అనేక పుస్తకాల్లో ఆరోగ్యదృష్ట్యా ఉప్పు తినవలసిన అవసరం లేదనీ, ఉప్పు వాడకపోతే ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుందని చదివాను. బ్రహ్మచారులకు ఇందువల్ల లాభం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. శరీరం దుర్భలంగా ఉంటే పప్పు తినడం మానాలని కూడా చదివాను. అనుభవం మీద ఈ విషయం తెలుసుకున్నాను. కాని నేను వాటిని అప్పుడు మానలేకపోయాను. ఆపరేషను అయిన తరువాత కస్తూరిబాయికి రక్తస్రావం తగ్గిపోయింది. తరువాత అది మళ్ళీ ప్రారంభమైంది. తగ్గలేదు. జల చికిత్స వల్ల ప్రయోజనం చేకూరలేదు. నా చికిత్సల మీద ఆమెకు విశ్వాసం తక్కువే కాని ఆమెకు అవిశ్వాసం కూడా లేదు. ఇతర చికిత్సలు చేయించుకోవాలనే కోరిక కూడా ఆమెకు లేదు. చివరికి పప్పు ఉప్పు రెండూ వదలివేయమని సలహా ఇచ్చాను. ఎన్నో విధాల నచ్చచెప్పాను. అనేక గ్రంథాల నుండి ప్రమాణాలు కూడా చదివి