ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

191

ఆహార విధానం, ఆహార నియమం వలె ఉపవాసం కూడా ఒక బాహ్యోపచారమే. ఇంద్రియ సముదాయానికి రాక్షసబలం ఎక్కువ. నలు ప్రక్కల, పది దిక్కుల క్రింద, పైన కాపలా పెడితేగాని అది లొంగదు. కడుపు మాడిస్తే ఇంద్రియాలు దుర్భలం అవుతాయి. అయితే ఇచ్ఛాపూర్వకంగా చేసే ఉపవాసాలు ఇంద్రియ దమనానికి తోడ్పడతాయి. కావున ఉపవాసాలు చేసే వారిలో చాలామంది సఫలురు కావడంలేదు. ఉపవాసం చేస్తే సమస్తం లభ్యమవుతుందని వారు భావిస్తూ వుంటారు. బాహ్యోపవాసం చేస్తూ వుంటారేకాని మసస్సులో మాత్రం భోగాలన్నింటిని భోగిస్తూనే వుంటారు. ఉపవాసం పూర్తయిన తరువాత ఏమి తినాలో యోచించుకొని ఆ పదార్థాల రుచుల్ని గురించి ఉపవాస సమయంలో యోచిస్తూ వాటి రుచుల్ని ఆస్వాదిస్తూ వుంటారు. అయ్యో, నాలుక మీద సంయమం ఉండటంలేదు, జననేంద్రియం మీద సంయమం ఉండటంలేదు అని అంటూ వుంటారు. మనస్సు కూడా ఇంద్రియ సంయమనానికి తోడ్పడినప్పుడే ఉపవాసం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అంటే అసలు మనస్సులో విషయ భోగాల యెడ వైరాగ్యం జనించడం అవసరం. విషయ వాసనలకు మూలం మనస్సు. అది వశంలో వుంటే ఉపవాసాది సాధనాలు ఎక్కువగా ఉపకరిస్తాయి. కానియెడల ఉపకరించవు. ఉపవాసాలు చేసినా మనిషి విషయాసక్తుడుగా ఉండవచ్చు కనుక మనస్సును అదుపులో పెట్టుకొని ఉపవాసం చేయాలి. అప్పుడది బ్రహ్మచర్యానికి అమితంగా తోడ్పడుతుంది.

బ్రహ్మచర్యం విషయంలో చాలా మంది విఫలత్వం పొందుతూ పున్నారు. ఆహార విహారాదుల విషయంలో వాళ్ళు, అబ్రహ్మచారులుగా వ్యవహరిస్తూ బ్రహ్మచర్యాన్ని రక్షించుకోవాలని భావిస్తూ వుంటారు. ఇది గ్రీష్మకాలంలో హేమంతాన్ని కోరడం వంటిది. స్వచ్ఛంద వర్తనుడి జీవితంలోను, సంయమం కలవాడి జీవితంలోను వ్యత్యాసం పుండాలి. ఇరువురికీ పైపైని సామ్యమే కాని లోలోన భేదం వుంటుంది. యిద్దరూ చూస్తూనే వుంటారు. కాని బ్రహ్మచారి పరమేశ్వరుణ్ణి చూస్తూ వుంటే భోగి నాటకాలు, సినిమాలు చూస్తూ వుంటాడు. ఇద్దరూ వింటూ వుంటారు. కాని బ్రహ్మచారి భజన గీతాల్ని, భక్తి గీతాల్ని వింటూ వుంటే భోగి విలాసగీతాన్ని వింటూ వుంటాడు. ఇద్దరూ జాగరణ చేస్తూ వుంటారు కాని బ్రహ్మచారి హృదయ మందిరంలో రాముడు ఆరాధింపబడితే, భోగి హృదయం నాట్యరంగంలో తేలి ఆడుతూ వుంటుంది. ఇద్దరూ భుజిస్తారు. కాని బ్రహ్మచారి శరీర రూపంలో నున్న తీర్థక్షేత్ర రక్షణ కోసం మాత్రమే భుజిస్తాడు. భోగి రుచులకోసం రకరకాల పదార్థాలు సేవించి ఉదరాన్ని దుర్గంధమయం