పుట:సత్యభామాసాంత్వనము.pdf/83

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

సత్యభామాసాంత్వనము

చ. వెఱవక పోరు చూచుటలు వెన్నెలకుప్పలొ కాక గవ్వలో
     గురుగులొ బొమ్మరిండ్లొ మఱి గుజ్జనగూడులొ పెండ్లివీడులో
     పొరిఁబొరి నిచ్చలున్ విసరుపువ్వులరువ్వులొ తేటనవ్వులో
     యరయరు కార్యముల్ మృగము లట్ల వెలందులఁ దెల్ప శక్యమే?

సీ. పాటలాధర[1]యాటపాటలా యింక ని
                    శ్శంకశాత్రవవీరహుంకృతములు
     బోటు లాడెడిపూలయేటులా రిపుకోటి
                    నాటితకరవాలపాటనములు
     తేటలాగునఁ జిల్కమాటలా యక్షత
                    ప్రతిపక్షభటరూక్షభాషణములు
     నీటు లానెడు వీణెమీటులా హుంకార
                    చంకనదరిచాపటంకృతములు
తే. బోటు లాసించుముత్యాలసేటులా ర
     ణాంతదుర్దాంతకుంతప్రహారధార
     లువిద యిది చండితన మని యుండియుండి
     యకట యీవేళ సంగ్రామయాత్ర యేల.

చ. ఉవిదలతోడ మర్త్యుఁడు రణోర్వికిఁ బోవుట యెట్లు పోయెనా
     బవరము చేయుదానవులపైఁ బడి చూపుట యెట్లు చూపెనా
     యవిరళబాణజాతముల నంగనఁ గాచుట యెట్లు కాక నీ
     సవతులు విన్న నెట్లు మఱి [2]శారదపూర్ణనిశాకరాననా.

క. మానవసమరమువలెనా
     మానవతీమణి యివేటిమాటలు బళిరే
     దానవరణభీషణదశఁ
     దా నవలా చూతు వనుట తగునే యెందున్.

  1. యాలపాటలా
  2. శారదపూర్ణసుధాకరాననా