ఈ పుట ఆమోదించబడ్డది
2
విశేషించి యెఱుంగక పోయినను, నావలన నేలాటి యుపకారము లేకపోయినను వీరు దీని నచిరకాలమున ముద్రింపించి యొసంగిరి. వీరి సౌహార్ద్రము ప్రశంసార్హము. వీరి భాషాసేవ ప్రశంసార్హము. భగవంతుడు వీరి కెల్లవిధములఁ దోడ్పడుఁ గాక యని ప్రార్థించుచున్నాఁడను. ఇంతకన్న వ్రాయఁదగిన విశేషము లేవియు లేవు. పండిత కవు లిందలి తప్పులను నాకుఁ దెలుపుదురు గాక యని వారిని వేడుచున్నాఁడను.
ఇట్లు విద్వద్విధేయుఁడు,
జనమంచి శేషాద్రి శర్మ.
శ్రీ. శ్రీ. శ్రీ.