పుట:సత్ప్రవర్తనము.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

సత్ప్రవర్తనము.

నట్లేయయ్యెను. ఏచే నొకపని చేయవలయునన్న యూహ కల్గెను. అంతయు గాని మనస్సున నపూర్వయుగు నుత్సాహము కల్లెను, అది యానందముగాఁ బరిణమించెను. వారికే యచ్చెరువుగాఁ దోచెను. ఏమిది యని యూహింపసాగిరి. దాసు గారి నడుగ సుంకించిరి. ఏమనుదురో యన్న ద్వాపరము వారి నలుగకుండ నొక్కెను. వారు గుటకలు మింగ సాగిరి. దాసెఱింగెను. సంశయమును దీర్పనెంచెను. “బాలకులారా! యివి వృక్షక్షీరములు, సాదుతరములు. దీని మహిమ మపొరము. ఎఱుగం గోరితిరి. సంచరించితిరే ఏల? గురువు మోల సంశయంచుట పొరబాటు . సంశయం దీర్చుకొనుటకే కదా జనులు గురువుల నాశ్రయింతురు. వారి శంకలం దీర్పఁజూల రేని వారికి గురునామము భారమే యన వలయును. ఈ శంకలం దీర్పుఁడని గురువుల నడుగుట శిష్యులకు విధి. ఇంక వినుఁడు. ఈ తీరము లేవృక్షమునం గలుగునని మాత్రము ప్రశ్నింపరాదు. అవి యించుక రహస్యమే, ఎల్లలకు: డెలుపలదగదు. సంసారమునం బవర్తించు వారి కివి నచింపరాదు. శరీరధారణమునకుఁ బెక్కు పదార్థ ములు వారికిం గలవు. మావంటి వారలకే యిట్టివి పనికి వచ్చును. వీనివిషయము దెల్పిన నీని నిర్మూలింతురు. ఆశా విరహీతులకే యివి పనికివచ్చును, ఈక్షీరములవలని లాభము ములం దెలిపెద ఆలకింపుఁడు, వీనిం ద్రావిన కుత్పిపాస లడంగును, ఆహారాంతరము కావలయునన్న యాశ యుదయింపదు. మఱియు నిద్ర, బాధింపదు. ఇంతీయ కాదు. మనస్సు నిర్మలముగా నుండును. మేదశ్శక్తి వృద్ధియగును. నే త్రాదిరోగములు రావు, వచ్చియున్న నవి తమంతట తొలంగును, దూర