పుట:సత్ప్రవర్తనము.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

సత్ప్రవర్తనము.


దీంప గోరుచుండును. కానీ నలుగురిలోఁ దలయెత్తుకొని “తగుదు నమా” యని తిరుగ జంకుచుండెను. తండ్రి, యావిధ మించుక యెఱింగెను. చాసు. దానిందీర్చినంగాని బాగుపడఁడని నిశ్చయించి యొక నాడు కుమారునికి బిలిచి “నాయనా! లజ్ఞ వదలుము. గతమునకు వగవరాదు. సాధుసంగతి సంపాదించు గొనుము అల్పులతో మైత్రి మంచిదిగాదు,

ఉ, 'నీరము దప్త లోహామున నిల్చి యనామకమై నశించు నా
నీరమే ముత్యమట్లు స జ సంస్టీరమై తనర్చు నా
నీరమె శుక్తిలోబడి మాణిక్యము గాంచు సంఘటించిత ప్రభన్
పౌరుషవృత్తు లి ట్లధము మధ్యము నుత్తము గోల్చవారికిన్.'

అని "పెద్దలు వచింతురు.. సాధు సంగతి సర్వదా సర్వదా శుభ దాయకము.

"

తే. 'సత్యసూక్తి ఘటించు ధీఱడిమ మార్చు
గౌరవ మొసంగు నరులకు గలువ, మడచు
గీర్తి బ్రకటించుఁ జిత్తవిస్ఫూర్తీఁ జేయు
సౌధుసుగంబు సకలార్థసాధనంబు."

అన్న వాక్యమును జక్కఁగా మది నిలిపి ప్రవర్తింపుము. దాన నన్ని గొఱింతలు తీఆును, మర్యాద కలుగును. సాధు సంగతిని మించిన దేదియు వృద్ధినొందు మార్గము లేదు,” అనియు నెన్ని యో విధముల బోధించెను. తుదకు మీ యానతి మైం బవర్తింతునని శపథము చేసెను. దాని కలరి పత్నితో నాలో చించి యొక శుభదినము నిర్ణయించి 'యోగివర్వుని చెంత కరుగఁ దలంచుచుండెను. కొడుకును దండ్రి, యానతి మీఱి రాదను విశ్వాసముగలవాడుగా నపుడున్నఁ దనఁ దాసును