పుట:సత్ప్రవర్తనము.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

53


కోని తనపొత్తు మానుకొనఁ బట్టుదల కలిగియున్న వారనియు నెఱింగి సోమరులు కొందఱు తన్నుఁ బరివేష్టించి యుండఁగా నొకయింటిలో నేందో కూరుచుండి రహస్యాలోచనము చేయుచుండెను. కొందఱందు మరల విధ్యార్డులకు బోధించి తమవంకఁ దిప్పుకొందుమనిరి. కొందజు "దీన 'సేమగును? మీతండ్రి ధనమీయకున్న నీ పాఠశాలయే నిలిచిపోవును నీ వింటికిఁ బోయి యన్నము మాని పట్టుపట్టిన మీతండ్రి, ధనమీయ మానును. ఉపాధ్యాయులందఱు వచ్చి తుదకు నిన్నే ప్రార్థింతురు, మనమపుడు మరల సభ చేసే సీతారామరాజే దీనికిఁ గారణమని తీర్థానము ప్రతిపాదింప జేయవలయునని. చెప్పుదము, విధి లేక వారంగీక రింతురు. గ్రామమునఁ గల పెద్దల నందలం బిలిపించి నారియెదుట నాతీర్మానమును జేయింతము, అప్పుడెల్లరు నిన్నే శ్లాఘింతురు. బాలురకు సెల్లరకు నీయందే గౌరవము హెచ్చును. నీ సాయము లేక పాఠ శాల సాగదని తోఁచును. మనయి చ్ఛాను సారము ప్రవర్తింతము. ఉపాధ్యాయు లెల్లరు నిన్నును, నీమూలమున మమ్మును జూచి భయంపడుదురు. కరీకులలో మనలఁ గృశార్డులను గాఁ జేయు దురు. మన దే రాజ్యమగును.” అనియు బోధింప నాలకించుచు నవ్వుచు నడుమనడుమఁ గాదపాత్రస్థ లవణ బొప్పోదకమును (Soda Water) ద్రాగుచుఁ బత్ర, ధూమమును (Beedies and Cigarettes)బీల్చుచుఁ దానే మహారాజు సనియుఁ దనవల ననే యెల్లరు బ్రదుకుచున్నవా రనియు సనుకొనుచు నవ్వుచు వారాపత్రికల జూచుచున్నట భినయించుచు సంతోషించు. చుండెను.