పుట:సత్ప్రవర్తనము.pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

51


చ. 'జనమని బూజలంగడు: బ్రసన్నుని జేయునతండుపుత్రుడే
పనికమెలంగు భర్తృవశపర్తినియై యది సత్కళత్ర, మే
జనుఁడువిపత్తిసౌఖ్య సదృశ క్రియఁడాకండు మిత్రుండీ త్రయం
బునుజగలిన్ లభించుఁ గడుఁబుణ్యము చేసిన యట్టి వారికిన్..'


అన విందుము గదా. నీమాటలచే నూఱట నొందగల్లి తిని. మనమింక సుతుని బిలిపించుకొను ప్రయత్నము చేయనలయును. నాకొక్కటి తోఁచుచున్నది. ఇప్పటి స్థితినిబట్టి చూడఁగా వాడు దేశాంతరమునకుం బాఱిపోవునని తో చెడు. ఋణము లిచ్చిన వారు నాకడకరు దెంచి యడిగిరన్న వార్త వాడు వినియుండును. తనదుర్లయమునఁ బాఠశాలలోని బాలురు తిరుగుబాటొనర్చుట, యది తుదకుఁ దన యవినీతి చే సొగినట్లు స్పష్టముగుట, బాలు తెల్లరు తనమాటలకు లోఁబడ కుండుట, సీతారామవర్త తననీతి మహిమమున బాలుర దుచ్చేష్టలఁ దొలఁగించుటయు, మహాసభలోఁ దన ప్రవృత్తి సెల్లరు ఖండించుటయు, నుపాధ్యాయులు కూడ సీతారామరాజు గుణములఁ బొగడుటయు మనకుమారున కేవఱకే తెలిసియుండును. కావునఁ దన ప్రయత్నములు విఫలముల గుటయేగాక తోడి బాలురు తనతోఁ జెలిమి చేయనీయ కోనక యుండుటయు నెఱింగి యుపాయాంతరము లేక పొఱిపోవుననియే తోచుచున్నది. కావున మన మీతరుణమున జాగు చేయుట పొడి గాదు, కుముదవల్లి కింబోయి వానినెట్లయినంగనుంగొని పిలుచుకొని రావలయును. ఈ కార్యమున నాకంటే నీకే యెక్కుడు శక్తి కలదు. నన్నుం జూచి వాఁడించుక జంకును, తల్లివి గాన నీకడ వానికి జనువు మెండు. కాఁబట్టి నీవిప్పుడే పోయి పిలుచుకొని రాలయును, ఎన్నఁడు పరగృహముల కరుగ నెఱుఁగని.