పుట:సత్ప్రవర్తనము.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

47

 డసును, సుజల వదలక యడిగిన మౌనము సమాధానముగా సుండును, ఇట్టి నియమము గలవాడు కావున నా యోగి వర్యుని దర్శించి సంసార సాగరము నుత్తరించు సుపాయము నడు గుదురు, వారి వారి యోగ్యతలకుందగి నట్లుపాయము తెల్పును కపట భక్తులు ప్రశ్నించినచో వారి కనుకూలముగా సమాధానము వచ్చును. కావున నింగితజ్ఞుడని యమహాత్ముని భావించుచుండిరి. మధుసూదనరాజు కుమారుని దుర్ణయము లందలపోసీ వానిని సుశీలుం గాఁ జేయుమార్గ మరయుదమని నిశ్చయించు కొని యాభగీరథ దాసుకడ కొక నాడు పోయెను. భార్యయం. గూడ నేగెను. ఉచిత కాలమున దర్శించి నమస్కరించి తదసుమతిఁ గూరుచుండెను. భార్వయు నొక పక్క కూరు చుండెను. కుశల ప్రశ్నము చేయుచు నానడుమ,

"అజాశనుృతమూత్రాణాం వరమాచ్యౌస సారి సుః,
సకృష్ణుఃఖకరా వాద్యావం తీసుస్తు పడేవటే."

అనుశ్లోకమును జదివెను. (పుట్టనివాడు, పుట్టీ చచ్చిన "వాడు, మూర్జుఁడు నను నీ మూవురిలోఁ దొలియిరువు రుత్తములు. మూడవవాడు కాఁడు. ఏలయన నేపుడో యొకసారి "మొదటి యిరువురు స్మృతికిఁ దగులుదురు మూఁడవ వాండట్లు గాక ప్రతినిముసమునందును స్మృతి కిందగులుచుండును.) అశ్లో కమును విని యించుక దేన భాషాపరిచయము కలవాఁడగుట రాజు దానియర్ల మెఱింగి మనసున వగచుచు సడుగ రాదని, యెఱింగియు “మహాత్మా! పుత్రరూప దుష్కర్మఫలము తొలంగుమార్గ ముపదేశింపుమా" యని దీనాననుండై ప్రార్థించెను.