పుట:సత్ప్రవర్తనము.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

సత్ప్రవర్తనము.


కొందఱు యోగులమనియో దాసులమనియో సన్యాసులమని యో మాంత్రికులమనియో పేరు పెట్టుకొని మఠములు కట్టింతుమని యో దేవాలయముల నుద్దరింతుమని యో వేదాంత పాఠశాల స్థాపన మొనర్తుమనియో పర దేవీ ప్రీతిగా యజ్ఞము నొనరింతుమనియో కారణమును దెల్పి ద్రవ్యయమును సేకరింతురు. వీరివలన జీవించువారు కొందఱుందురు. వీరికిని వారికి నేనో యాంతరంగి గానుబంధము లుండును. ఆ సంబంధములు పాశములవలె వీరి కర్వురకును మైత్రిని బంధించి యుంచును. వానికి లోనై పలుశ్రమములకు లోనై సేకరించిన యాధనముచే వారింబోషింతురు, దానిచే స్వార్థము నశించునని వారెఱుంగరు. పామరులు వారి వేషములం జూచీ భ్రమించి ధన మొసంగుదురు. ఇట్టి యాచారము లోకమునఁ బ్రసిద్ధమే కొని కొ త్తది కాదు. భగీరథ దాసు నివారిలోఁ జేర్పఁదగినవాడు కాడు, ప్రతిగ్రహ మేఱుంగని నియతుఁడు, అసత్యమాడని పవిత్ర, నచనుఁడు. పరోపకారమే తపఃఫలమని భావించు జ్ఞాని కావున నాతనియందెవ్వరికి గాని యీర్యలేదు, విశేషించి భక్తియుండెను. సాధారణముగాఁ బ్రతిదిన మాతని కుటీరము కడం గ్రొత్తవారగపడుదురు. మధ్యాహ్నముదనుక నా చెంత మాటలాడరాదని మెల్ల రెఱుంగుదురు. ఆపల నాయోగి సమాధి మానిరాఁగా ఫలాహారానంతరము వారిని దర్శింతురు. "రెండు మూడు గడియలా యోగి మాటలాడును. మంచి మాటలు నాలుగు తెలుపును. తమ కష్టములం దెల్సి వానిఁ దొలఁగించుకొను నుపాయమడుగ భగవంతుని సమ్ముడను మాటయే బదులు వచ్చును. ఇంకను బ్రశ్నించినఁ బెద్దలనడుగుఁ