పుట:సత్ప్రవర్తనము.pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

సత్ప్రవర్తనము.


బక్ష పాతము కలదనవచ్చునా? ఇంటి పెత్తనముఁ బూను వాని కనేక కష్టము లుండును. ఎల్లరను సంతోషపఱు వలసిన భార మాతనిపయి నుండును. దేహమంతయుఁ గనులుగాఁ జూచి నను గొందఱకు మనస్సంతృప్తి లేకుండ సుండవచ్చును. కాని యా యజమానుని మనః క్షేమము విచారించిన 'నేమనుటకు నోరాడక యుండును. ఇది మీరెఱింగిన దేకాని కోత్తది, కాదు, మాకీపాఠశాలయే కుటుంబము. మీక్షేమమేమాక్షే మముగా భావించుచుందుము. ఐన నెల్లరకు కొక్క విషయమున సంతృప్తిని గలిగించుట సాధ్యము కానిపని. మీలోఁ గొందరితరులు ప్రోత్సహింప మూర్కత్వమును వహించిరి. ఇందులకుఁగల కారణ మిదియని యెఱుంగ నేరకయున్నాము. మేము విన్నంతలో నీషతుకూడ మాలోపము కానరాదు. ఒక్క యాటకుఁ బదునొకండుగురు బాలురుండవలయును. తక్కిసవారెల్ల మమ్మేల యెన్ని కొన లేదన్న మేమేమని బదులు చెప్పవచ్చునో మీరేయించుక యోజింపుఁడు, ఆ సంఘమునం దు'పాధ్యాయులు సంఖ్యకంటే విద్యార్థుల సంఖ్యయే యధికము. 'నెలకొక్కసారి యట్టియాట సాగుచుండును. వరుసగా నెల్లరకు వంతు వచ్చును. విద్యార్థులే వీరియాట యాడవలసినదని నిశ్చయించి నపుడుపాధ్యాయులు పక్షపాతమూ నిరన్న బదు లేమని చెప్పువచ్చును? ఈ విషయమున 'మేమును జింతింపవలసిన వార మై తిమి. స్వల్ప విషయములఁ గొండంతలు చేసి యెవ్యరో సోమరులు తెలిసిన దుర్వచనములకు లొంగి బుద్ధిబలములు బోనాడి యిట్టి కట్టడి కార్యముల నవలంబించుట లగ్గు గాదని తెల్ప 'సాహ సింపవలసివచ్చినది. నలువురు విన్న దానిని వేయిమడుంగులు చేసి చెప్పుకొందురు. అందలి సత్యాసత్యములు పామరు.