పుట:సత్ప్రవర్తనము.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

37

చిత్తములు సుంత రంజిల్లెను. ప్రధానగురువు వర్మతో నీయాగ మనమున నీచిక్కులు తీఱునని తలంచుచున్నాడను మిగులు బుద్ధిమంతుఁడవు. నీవర్తనమే నీ పేరును బ్ర క

టింప జేయు చున్నది అని పలుక వర్మయుఁ జేతులొడ్డి గురువులు శిష్యుల నిట్లుగ్గడించుట న్యాయము కాదు. అనుగ్రహమున నా శీర్వదంప పలయును. అదియే మాకు శ్రేయస్సు అనిపలికి తనప్రవృత్తి నెల్ల నెంఱింగించెను. ఆయుపాధ్యాయు లెల్ల విస్మయంపడుచు నప్పుడ పరత్రులగు రాయబారులంబంపి తొలుతటి విద్యార్డులను రావించెను వారింగూడి మఱికొందఱు వచ్చిరి, విద్యార్డులు పెక్కండ్రు పోవుచున్నారనే యని పెక్కండ్రు వారి వెంటఁబోయిరి. రెండవజాము చివర భాగమునకు మూడు వంతులు విద్యార్థుల సంఖ్య పాఠణాలయం దుండెను. సభాస్థానమున నెల్లరం గూరుచుండ నియోగించి వేదికనెక్కి మాటలాడుమని వర్మను 'బాఠశాల, ప్రధానోపాధ్యాయుడు నియోగించెను. వేదిక పైకి సీతారామరాజు రాగానే కర తాళధ్వనులు మిన్ను =ముట్టెను. అంతనతఁ డిట్లు ప్రసంగించెను.సోదరరత్న ములారా! గురువుల యానతం గొని నాలుగు మాటలు మీయెదుటఁ బల్కెదను. చక్కఁగ నాలకింపుఁడు. మన మీపవిత్ర గృహమునకు వచ్చుట విద్యావంతుల మగుదుమను సూహచేతనే కొని కాలక్షేపమునకుఁ గాదు. తల్లి దండ్రులు మనము విద్యావంతులమై యశస్సునార్జించి తమకు వార్దకమున నుపచరింతుమని యువ్విళ్లూరుచుందురు, సకల కష్టములకు లోనై మనలఁ బెంచిరి. మసము కృతజ్ఞులమై వారిఋణమునఁ గొంతయైనఁ దీర్చుకొనవలయును. అదియే మనకుఁ గర్త వ్యము, దాని నెజు వేఱునట్లు చేయకున్న మన జీవితము వ్యర్థము.