పుట:సత్ప్రవర్తనము.pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

23


పోవునేమో, లేక లేక కలిగిన సంతానము కాన నామనవి సంగీకరించి బుద్దివచ్చునట్లు చేయుఁడని స్వాభిప్రాయమును వెల్లడించెను. ఇంటియందును విద్యాలయందు నొక రీతిగా నాతని ప్రవృత్తి యున్నదని వారెఱింగిరి, నిర్బంధించి పాఠములు చెప్పసాగిరి. తోడి బాలురుకూడ నేపగింపసాగిరి. ఈ గురుతు లన్నియు "వారి కనురాగము మున్నున్నయట్లు లేని యాత నికీం దెలియఁ జేసెను. సూర్యనారాయణ రాజు బుద్ధిమంతుఁడు కావున సచిర కాలములోనే వాని నెల్ల గ్రహీంచెను. ప్రతి ప్రాయచేయుటట్టని యాలో చింపసాగెను.

ఆపాఠశాలయందు వ్యాయామక్రీడాసంఘ మొకడు కలదు. వానియం దుపాధ్యాయులు కొందఱు విద్యార్థులు కొందఱు నుండిరి. పద్దతుల నిట్టివని తెలుపు వారుపాధ్యాయులు. వాని నాచరింపజేయువారు, నాచరించు వారు 'బాలురు. ప్రధానో పాధ్యాయుడు సర్వాధికార సంకున్నుఁడుగాన సద్దానికిం గూడఁ బైయధికారిగా నుండెను. కాలిబంతియాట, {Foot-ball) సుఖ కందుకడ, (Tennis) విలాస కందుక క్రీడ (Badminton) లోనగు వ్యాయాము. క్రీడలందుఁ గలవు.. 'వానికిం గావలసిన పరికరములఁ దెప్పించి బాలుర కొసంగుట యుపాధ్యాయులని. వానీని జాగ్రత్తగా నునిచి యుక్త సమయములయందుకు యోగించుట బాలురపని పతి దినము సాయంకాల మొక గంట యాయాటలకు సమయము. పాఠశాలకుం జేరిన విశాల భూభాగ మద్దానికిగా నియమింపఁ బడియుండెను. దాని చుట్టును మూడుకోణములుగా నుండు నట్లు 'తాళ దుమములు . వేయఁబడియుండెను. అవి వృద్దియై పశువులుకూడఁ 'జోర రాని యట్లుండెను. అన్ని యాటలకు