పుట:సత్ప్రవర్తనము.pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

21


మున నుచితరీతి నట్టివారికే కొంత యిచ్చును. ఇచ్చునపు డితరులకుఁ దెలియక యుండవలయునని జూతనియాశయము. ముఖ స్తుతుల కుబ్బడు. విశ్లేషించి యితరులను భూషిండు. ఆ యలవాటు మంచిది కాదని యావిద్యార్థి నిశ్చితము. ఇత రులు తనకడ "వేఱొకరిని నిందించిన దానట నుండి లేచి పోవును. అట్లు చేయ నవకాశము లేదేనీ మనస్సును "వేఱొక పనియందు నియుమించును ఇతరుల దూషించు వారు తనను గూడఁ బరోక్షమున దూషింతురనియు, నట్టి వారి పొందు మంచిది కాదనియు నతని యభిప్రాయము. ఎవ్వరికడ నేంత మూత్రమేలాగు మాటలాడవలయునో యతనికి. దెలిసినట్లితరులకుఁ దెలియదని యెల్ల వారును కొందురు.


సూర్యనారాయణ రాజు కూడ సితారామరాజు చదువు కక్ష్యయందే చదువుచుండెను. ప్రతీవత్సర మాతని కింటియొద్దం జదువు చెప్పిన యుపాధ్యాయులకు పడరాని కష్టములఁబడి యందఱి నాశ్రయించి యెట్లో పై కక్షలోని కితనిఁ జేర్చు చుండుసు, విశేష బుద్ధిమంతుఁడు, అనారోగ్యమున నీనడుమఁ జదువజాలక పోయెననియు, నీవత్సర మందరకన్న మిన్నగాఁ గృపౌర్ణుఁడగుననియు నాయుపాధ్యాయుడు చెప్పుచుండువాఁడు. ఆతని దీనాలాపములకు మనస్సులు కరఁగి యెట్లో యిత రోపాధ్యాయు లౌదల లూపువారు. అంతియెకాని సూర్య నారాయణ రాజు చదువునందు శ్రద్ధకలవాడు కాక వ్యర్ణముగా గాలమును బుచ్చుచుండెను. వేళకుఁ 'బాఠశాలకు బోవక, చెప్పెడు విషయములపై బుద్ధినిలుపక యిరు ప్రక్కల సున్న బాలకులతో గుసగుసలాడుచు వారిపొత్తములందీసియొకరికిచ్చి యాయిరువురుసు గలహింపఁ దాఁ జూచి యానం,