పుట:సత్ప్రవర్తనము.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

19


శక్తి ఉత్సాహమే సంపద. అది లేకున్న వృద్ధి నెవ్వండును గాంచఁజూలఁడు, అదృష్టమున్నఁ దనకుదానే విద్య లభించునని కొంద ఱందురు. అది మిగులం బొరపాటు. దైవ పొరుషము లనఁబడునని రెండును శక్తిమంతములే. పౌరుషమనంగా బురుష ప్రయత్నమని యర్థము దైవమనఁగా నదృష్టము. పురుష ప్రయత్నము లేక దైవము ఫలింగదు. దైవము నే నమ్మి ప్రయత్నము చేయని వాడు కాపురుషు (మూర్జుఁడు) డనంబడును. దైవము తోడ్పడక పౌరుషము ఫలింపదు.

క. విను పురుషుడు కావింసని
పనులను జైషముడి యెట్లు ఫల మొనగించున్
జనములు కార్యము నడపంగ
సనుకూలత నిచ్చుంగాక యయ్యెఫలముల్ .

తే. పౌరుషము దైవముతో డ్పాటు లేక
ఫలము పొందంగ నేరడు పార్టీ వేంద్ర,
విత్తు సహకారి కాకున్న రిత్త నేల
వంధ్యయగుగాక తా ఫలవంతముగునె??

తే.మేలు రెండు లోకంబుల మేల తెచ్చు.
గీడు చేసిన తప్పుదు కీడ యగుట
గాన పురుషవర్తనముస కానుకూల్య'
శీలమగు 'దైవమది ఫలసిద్ధిం జేయు,

క. విను పౌరుషమును దైవము
ననరెండును గార్యఫలము నందింపగనె
ట్టన కారణములు గావున
జన నాయక సదృశములు విచారింపంగస్

,