పుట:సత్ప్రవర్తనము.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

సత్ప్రవార్తనము


ఏపాటి మూల్యమునకోయమ్మి కొందఱును బాలురఁ జదివింప సాగిరి. ఆవిద్య పూర్తి కాగానే తమబాలు రుద్యోగములలో బ్రవేశించి ధనము కుప్పలుగాఁ దెచ్చి తమయిండ్ల నింపుదురనియుఁ గోటీశ్వరులు వచ్చి తమతనయులకుఁ గన్యకల నిత్తురనియు దన్మూలమున గొప్పమర్యాదయు ధనము చేకూరునని వారూ హీంచిరి, మఱికొందఱు దేశాటనము చేసి ధనమార్షించి తెచ్చి చదివించుచుండిరి. ఈరీతిగా 'నాకనకపల్లింగల బాలుడు పొథశాలకుఁ బోయి చదువుచుండిరి. క్రమక్రమముగా విద్యార్థుల సంఖ్య హెచ్చుచుండెను. దానింబట్టి యుపాధ్యాయుల సంఖ్యయు వృద్ధి నొండసాగెను..


ప్రతివత్సరమందుఁ బరీక్షలు సాగుచుండును. అందాఱితేఱినవారికి బహుమతులియ్యబడును, ఆత్తఱినొక గొప్పసభ సాగును, పెద్దమనుష్యు లచటికీ వచ్చుచుందురు. పాఠశాలా ద్యక్షుడు వారివారి యోగ్యతలం గెలుపును. సభ్యులు కొంద అంతకుముందే నిర్ణయించిన బహుమతుల నా యావిధ్యార్థుల కిత్తురు. బహుమతుల నిచ్చుట కొసభ కోక యధికారి వరింపం బడును, ఆయన య గ్రాసనాధిపతి యని పిలువఁబడును. పాఠ ఖాలాధికారి యోగ్యతలను, సంవత్సరాయ వ్యయములను దెలుప న గ్రాసనాధిపతి యందుఁగల మంచి చెడుగులను డెలుపుచు నుపన్యసించి పిదప విద్యార్థులకు బహుమతుల నిచ్చును. వానింగాంచి తక్కుంగల విద్యార్థులు బహుమతులం బొంద వలయునని యూహించి పట్టుదలతోఁ జదువుదురను తలంపు, ననే యూ కార్యము జరపబడును, ఆపాఠశాలయందు బాలురతోడ బాలికలును జదువ సాగిరి, తొలుదొలుత బాలికలకు విద్యయే 'పనికి రాదనువారు